#StrongHERMovement Nita Ambani Workouts Video | మహిళా దినోత్సవం రోజు ఫిట్నెస్ జర్నీ షేర్ చేసుకున్న నీతా అంబానీ | ABP Desam
అరవై ఏళ్లు దాటినా హెల్తీగా ఉండాలంటే తనేం చేస్తున్నారో వివరించారు నీతా అంబానీ. శరీరం ధృఢంగా ఆరోగ్యకరంగా ఉండేందుకు చేస్తున్న వర్కవుట్స్ రొటీన్ ను నీతా షేర్ చేసుకున్నారు. #StrongHerMovement పేరుతో ఓ సోషల్ మీడియా ట్రెండ్ ను మహిళా దినోత్సవ సందర్భంగా ప్రారంభించారు నీతా అంబానీ. "61 సంవత్సరాలలోనూ ఆపలేని ఉత్సాహం! ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శ్రీమతి నీతా అంబానీ ఆమె ప్రేరణాత్మకమైన ఫిట్నెస్ ప్రయాణాన్ని గురించి వెల్లడిస్తూ… అన్ని వయస్సుల మహిళలను వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఆమె తన రోజువారీ జీవనశైలి అలవాట్లు, ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. 61 ఏళ్ల వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ప్రతిరోజూ #StrongHERMovement లో చేరి, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, మరింత దృఢంగా మారి.. మరిన్ని విజయాలు సాధించండి !" అంటూ మహిళల్లో ప్రేరణ నింపే ప్రయత్నం చేశారు నీతా అంబానీ





















