అన్వేషించండి

Hayagriva Jayanti 2023 : శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీయ జయంతి, జ్ఞానప్రదాతగా ఈయన్ని ఎందుకు పూజిస్తారు!

శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి రోజు మరో ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. హయగ్రీవుడిని ఆరాధించే విద్యార్థులకు సకల విద్యలు సిద్ధిస్తాయని చెబుతారు

Hayagriva Jayanti 2023 : దుష్ట శిక్షణ-శిష్ఠ రక్షణ చేసి ధర్మ సంస్థాపనకు శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలెత్తాడు. వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం శ్రీ మహావిష్ణువు మరో అవతారమే హయగ్రీవుడు.

హయగ్రీవ అవతారం వెనుకున్న పురాణగాథ
పూర్వం గుర్రం తలను కలిగిన ఓ రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు  బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారి వలన మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. ఆ గర్వంతో  దేవతలను హింసించడం ప్రారంభించాడు. ఆదిదంపతులను శరణువేడిన దేవతలంతా ఆ రాక్షసుడి బారినుంచి కాపాడమని వేడుకున్నారు. అయితే యోగనిద్రలో ఉన్న శ్రీహరిని (దక్షిణాయనం మొత్తం శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయంలో మేల్కొంటాడు) మేల్కొలిపితే ఆయనే సంహరిస్తాడని చెప్పింది పార్వతీ దేవి.  శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపుతాడు. తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగరడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరై పోయిందట. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చి.. దేవతలంతా కలసి తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. అందుకే హయగ్రీవుడిని స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడని పురాణాల్లో చెబుతారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన తర్వాత స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

Also Read: రాఖీ కట్టించుకుని బికారిగా మారిన జమిందార్ - ఈ గ్రామాల్లో రాఖీ అస్సరు జరుపుకోరు!

హయగ్రీవ శ్లోకం
” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారం అని అర్థం. కేవలం విద్య మాత్రమే కాదు.. రాఖీ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని ఆరాధిస్తే అన్ని కార్యాలయాల్లోనూ విజయం సిద్ధిస్తుందని చెబుతారు.

Also Read: రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారో తెలుసా!

హయగ్రీవ సంపదా స్తోత్రం(Hayagreeva Sampada Stotram in Telugu)

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః  ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ 
తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్  ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః  ||

శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||

ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత
హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget