Iron Dome System: ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డ్రోమ్ ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా?
Israel Iran War | వేలాది రాకెట్లు పడుతున్నా అక్కడి ప్రజల ధీమా ఏంటంటే ఐరన్ డ్రోం. అయితే ఐరన్ డ్రోం ఒక్కటే వ్యవస్థ ఇజ్రాయెల్ ను కాపాడుతున్నాయా.. ఇంకా అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా
Israel Iron Dome System| ఇజ్రాయెల్ రాకెట్ ఢిపెన్స్ సిస్టమ్ ఐరన్ డ్రోమ్ ఒక్కటే అందరికీ తెలుసు కాని. మరో రెండు మిస్సెల్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయని మీకు తెలుసా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందా. ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నా చాలా దేశాలు శత్రు దేశాలే. అందులో ముఖ్యంగా పాలస్తీనా హమాస్, లెబనాన్ లోని హెజ్బుల్లా, యేమెన్ లోని హౌతీ తీవ్రవాదుల ముఖ్య లక్ష్యం ఇజ్రాయేల్ పై దాడులే. వేలాది రాకెట్లు గత ఏడాది నుండి ఇజ్రాయేల్ పై పడుతున్నాయి. వీటన్నింటిని చాలా వరకు అడ్డుకుంటున్నది ఐరన్ డ్రోమ్. ఈ రక్షణ వ్యవస్థతో ఇజ్రాయేల్ పై వచ్చేటి మిస్సైల్స్ అన్నింటినీ అడ్డుకుంటోంది ఈ ఐరన్ డ్రోమ్. అయితే ఈ రక్షణ వ్యవస్థ ఒక్కటే మనకు తెలుసు. కాని ఈ మిస్సైల్స్ నుండి ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్న మరి కొన్ని మిస్సైల్ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
ఐరన్ డ్రోమ్..
ఈ మిస్సైల్ రక్షణ వ్యవస్థను తమ దేశ గగన తలంపైకి దూసుకు వచ్చే మిస్సైల్స్ ను అడ్డుకునే క్విక్ రియాక్షన్ వ్యవస్థగా చెప్పవచ్చు. ప్రతీ రోజు వేలాది సంఖ్యలో దూసుకువచ్చే రాకెట్లను ఈ రక్షణ వ్యవస్థ గాల్లోని అడ్డుకుని వాటిని నిర్వీర్యం చేస్తాయి. కొన్ని సెకన్లలోనే వస్తున్న లక్ష్యాలను గుర్తించి వాటిని గాల్లో అడ్డుకునే క్విక్ గా రియాక్ట్ అయ్యే ఉక్క కచవం ఇది. దీన్ని ఇజ్రాయెల్ రక్షణ విభాగాలు అభివృద్ధి చేసిన అత్యంత విజయవంతమైన మిస్సైల్ విధ్వంసక కవచంగా దీన్ని ప్రపంచ మిలిటీరీ నిపుణులు చెబుతారు. ఇందులో గగనతలంలోని లక్ష్యాలను గుర్తించడానికి అత్యాధునిక రాడార్లు, సెన్సార్లు దీని కోసం వినియోగిస్తారు. ఈ వ్యూహత్మక రక్షణ వ్యవస్థ ఆధారంగానే ప్రపంచంలోని చాలా దేశాలు ఐరన్ డ్రోమ్ తరహా వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి.
సమ్సోనైట్ ( డేవిడ్ స్లింగ్)
ఈ రక్షణ వ్యవస్థ మధ్య దూర శ్రేణి మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇజ్రాయేల్ మిలిటరీ విభాగం రూపొందించింది. ఇది ఐరన్ డ్రోమ్ కంటే దూరం నుండి వచ్చే మధ్య శ్రేణి క్షిపణులను కూల్చడానికి ఉపయోగించే వ్యవస్థ. దీన్ని ఇజ్రాయేల్ సైంటిస్టులు, అమెరికా డిఫెన్స్ కన్సార్టియం కలిసి దీన్ని రూపొందించాయి. ఇది 40 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అడ్డుకునే వ్యవస్థ.
హైరాన్ (Arrow).....
ఇది ఒకటి గాని అంతన్నా ఎక్కువ గాని వార్ హెడ్లను మోసుకువెళ్లగల బాలిస్టిక్ మిస్సైళ్లను ఎదుర్కొనే క్షిపణి వ్యవస్థ. గగన తలం నుండి గగన తలంలోని లక్ష్యాలను అడ్డుకునే వ్యవస్థ హైరాన్. ఈ వ్యవస్థలో అధునాతన రాడార్లు, సెన్సర్లు, మిస్సైల్ నిర్దేశిక వ్యవస్థలు ఉన్నాయి. 50 కిలోమీటర్ల రేంజ్ నుండి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి అడ్డుకోగలవు. ఓ రకంగా చెప్పాలంటే ఇజ్రాయేల్ రక్షణ వ్యవస్థలో ఇది కీలకమైన వ్యవస్థగా మిలటరీ నిపుణులు చెబుతారు.
గెడ్రిన్ ( సీ -డోం )....
ఈ ఢిపెన్స్ సిస్టంనే సీ-డోం అని కూడా అంటారు. ఇది వార్ షిప్పులలో అనుసంధానించబడే వ్యవస్థ. సాధారణ మిసైళ్లు ను గుర్తించి అడ్డుకోవడం ముఖ్య విధిగా చెప్పవచ్చు. ఇది సముద్రతలం, గగనతలంపై ఉపయోగించే ఢిపెన్స్ వ్యవస్థ. దూర దేశాల నుంచి వచ్చే మిస్సైళ్లను సముద్రతలంపై గగనతంలోనే నిర్వీర్యం చేయడంలో గెడ్రిన్ వ్యవస్థ పని చేస్తుంది. ఇజ్రాయేల్ సైన్యానికి , ఆ దేశానికి రక్షణ నిచ్చే ముఖ్య వ్యవస్థగా చెప్పవచ్చు.
లేజర్ డిఫెన్స్ సిస్టమ్.....
ఇది అ్తత్యాధునిక సాంకేతికత జోడించబడిన డిఫెన్స్ వ్యవస్థ. అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన లేజర్ కిరణాలను ఉత్పత్తి చేసి శత్రువులు వదిలే రాకెట్లు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేసే డిఫెన్స్ వ్యవస్థ. విద్యుత్ ఆధారంగా పని చేసే సిస్టం ఇది. శత్రు లక్ష్యాలను అతి వేగంగా గుర్తించి,లేజర్ కిరణాల ఉత్పత్తి చేసి ఆ లక్ష్యాలపై ప్రసరింపజేయడం ద్వారా వాటిని ధ్వంసం చేస్తారు.
ఇవన్నీ కలిపే ఐరన్ డ్రోమ్ లేదా ఉక్కు కవచంగా పిలుస్తారు. ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానించబడి పని చేస్తాయి. స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, దూర శ్రేణి మిస్సైళ్లను అడ్డుకోవడానికి లక్ష్యాన్ని ఒక్కో వ్యవస్థను వాడతారు. ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ ప్రజలకు శత్రు మిస్సైళ్ల బారిన పడకుండా, ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా కాపాడతాయి. అంతే కాకుండా ఆ దేశ రక్షణ బలగాలకు విజయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యవస్థనే చాలా దేశాలు తయారు చేసే సన్నాహాల్లో ఉన్నాయి. రష్యా నుండి మన దేశం ఇదే తరహా మిస్సైళ్లను అడ్డుకునే వ్యవస్థను కొనుగోలు చేసింది.
మనదేశానికి ఐరన్ డ్రోమ్ - ఎస్ -400 ట్రింఫ్ ...
చైనా, పాకిస్థాన్ ల నుండి మనకు నిరంతరం ముప్పు ఉంది. దీంతో మన దేశం కూడా ఐరన్ డోమ్ తరహాలో రష్యా నుండి ఎస్ -400 అనే ప్రధాన క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. ఇందు కోసం 2018లో రష్యాతో ఒప్పందం కుదిరింది. 2022 నాటికే ఇది మన దేశానికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో అధునాతన రాడార్, మిసైల్ లాంచింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. గగన తలం నుండి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేందుకు రూపొందించబడిన వ్యవస్థే ఎస్ - 400. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం ఈ ఢిపెన్స్ సిస్టంకు ఉంది.