Russia Ukraine Conflict: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు, అడుగు పెట్టేందుకూ చోటు లేదం
Russia Ukraine Conflict: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Russia Ukraine Conflict:
బక్‌మత్ సిటీపై దాడులు..
ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలు రష్యా దాడులతో ధ్వంసం కాగా...ఇప్పుడు ఇంకా ఆ తీవ్రత పెంచుతూ పోతోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని బక్‌మత్ నగరాన్ని రష్యా సైనిక బలగాలు సర్వనాశనం చేశాయంటూ...ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షిపణి దాడులతో ధ్వంసం చేశాయని మండి పడ్డారు. దాదాపు 9న్నర నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌కు వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తోంది రష్యా. ఫలితంగా...ఆ దేశం దారుణంగా నష్టపోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా...ఆయా ప్రాంతాలను రికవరీ చేసుకోడానికి పోరాటం చేస్తోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు ఇంకా రష్యా అధీనంలోనే ఉన్నాయని, అక్కడి పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని చెప్పారు జెలెన్‌స్కీ. డోన్‌బాస్ ప్రావిన్స్ నుంచి రష్యాతో సరిహద్దు పంచుకునే ప్రాంతాలన్నింటిపైనా పుతిన్ గురి పెట్టారు. 2014 నుంచి రష్యా బలగాలు ఈ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. "బక్‌మత్, సోలెడర్, మర్యింక, క్రెమిన్నా ప్రాంతాల్లో కనీసం ఎక్కడా నిలబడటానికి కూడా చోటులేదు. అన్ని చోట్లా బాంబ్ షెల్స్ కనిపిస్తున్నాయి. పూర్తిగా ధ్వంసమైపోయాయి" అని ఆవేదనవ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. రష్యా దాడులు మొదలు పెట్టక ముందే...బక్‌మత్ ప్రాంతంలో ప్రజలు తాగు నీటికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక్కడి నివసిస్తున్న వారిలో 90% మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండ్రోజుల్లోనే 60 సార్లు రాకెట్ దాడులకు పాల్పడింది రష్యా.
పుతిన్ మనసు మారిందా..?
అయితే...ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. "ఈ మిలిటరీ ఆపరేషన్ ఎన్ని రోజులైనా కొనసాగుతుంది" అని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ...ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. "కలిసి కూర్చుని సెటిల్ చేసుకుంటే యుద్ధం ముగిసిపోయే అవకాశముంది" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్. "సెటిల్‌మెంట్ కాస్త కష్టమే అయినా... సమయం పట్టినా అదే ఈ ఉద్రిక్తతలకు స్వస్తి పలుకుతుంది. ఈ సయోధ్య కుదర్చటంలో ముందుకొచ్చిన వాళ్లెవరైనా సరే...క్షేత్రస్థాయిలో నిజానిజా లేంటన్నది మాత్రం తప్పకుండా పరిశీలించాలి" అని అన్నారు. అంటే...సయోధ్య కుదిర్చేందుకు ముందుకొస్తే అందుకు సిద్ధమే అన్న సంకేతాలిచ్చారు. కాకపోతే...ఆయన మాటల్ని బట్టి చూస్తే ఏదో ఓ కండీషన్ పెట్టి ఈ మ్యాటర్‌ను సెటిల్ చేసే అవకాముంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ ఇలా అన్నారని The Guardian పత్రిక వెల్లడించింది. అయితే..ఇదే సమయంలో మరోసారి అణుహెచ్చరికలు చేశారు.
"మాస్కోపై ముప్పేట దాడి చేయాలనుకుంటే రష్యన్ న్యూక్లియర్ శక్తి వాటిని తప్పకుండా అడ్డుకుంటుంది. అదే జరిగితే...శత్రు దేశానికి ఇంకేమీ మిగలదు" అని హెచ్చరించారు. "మా ప్లాన్ ప్రకారమే మిలిటరీ ఆపరేషన్ నడుస్తోంది. అక్కడ మాకెలాంటి ఇబ్బందులూ ఎదురవట్లేదు" అని స్పష్టం చేశారు.
Also Read: PM Modi: మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ, మహారాష్ట్ర పర్యటనలో బిజీబిజీ