PM Modi: మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ, మహారాష్ట్ర పర్యటనలో బిజీబిజీ
Samruddhi Mahamarg Expressway: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.
PM Modi in Nagpur:
వరుస కార్యక్రమాలు..
ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పర్యటనలో ఉన్నారు. పలు కీలక ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా..నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకూ 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రాగా...ఇప్పుడిది ఆరోది. నాగ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్ మధ్యలో ఈ ట్రైన్ సర్వీస్‌లు అందించనుంది. జెండా ఊపి ఈ ట్రైన్‌నుప్రారంభించిన మోడీ...స్వయంగా అందులో ప్రయాణించారు. ఫ్రీడమ్ పార్క్ స్టేషన్ నుంచి ఖాప్రీ మెట్రో స్టేషన్ వరకూ ప్రయాణం చేశారు. నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-1లో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్‌ని దేశానికి అంకితం ఇచ్చారు. ఇదే సమయంలో నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2కి శంకుస్థాపన చేశారు. "నాగ్‌పూర్ ప్రజలకు అభినందనలు. రెండు మెట్రో ట్రైన్స్‌ని ప్రారంభించాను. మెట్రో చాలా సౌకర్యంగా ఉంది" అని ట్వీట్ చేశారు మోడీ. ఈ కార్యక్రమం పూర్తైన వెంటనే...హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్-షిరిడీ మధ్యలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. 701 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. భారత్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే లలో ఇదీ ఒకటి. అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ మీదుగా ఈ రహదారిని నిర్మించారు. నాగ్‌పూర్‌కు వచ్చిన సమయంలో మోడీకి ఘన స‌్వాగతం లభించింది. సంప్రదాయ వాద్యాలతో ఆహ్వానం పలికారు. మోడీ కూడా స్వయంగా డ్రమ్స్ వాయిస్తూ అందరినీ అలరించారు.
Flagged off the Vande Bharat Express between Nagpur and Bilaspur. Connectivity will be significantly enhanced by this train. pic.twitter.com/iqPZqXE4Mi
— Narendra Modi (@narendramodi) December 11, 2022
On board the Nagpur Metro, PM @narendramodi interacted with students, those from the start up sector and citizens from other walks of life. pic.twitter.com/abvugNUxoC
— PMO India (@PMOIndia) December 11, 2022
PM Modi inaugurates AIIMS Nagpur with state-of-the-art facilities. Its foundational stone was also laid by him in July 2017.
— ANI (@ANI) December 11, 2022
The hospital will provide modern healthcare facilities to the Vidarbha region & will be a boon to the tribal areas of Gadchiroli, Gondia and Melghat. pic.twitter.com/kmQjdvKAui
#WATCH | PM Narendra Modi plays a traditional drum during his visit to Nagpur, Maharashtra today pic.twitter.com/grfI1M8Nmv
— ANI (@ANI) December 11, 2022
నాగ్‌పూర్ ఎయిమ్స్..
ఆ తరవాత నాగ్‌పూర్‌లోని AIIMS ఆసుపత్రిని ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. 2017 జులైలో దీనికి శంకుస్థాపన చేసిన ప్రధాని...ఇప్పుడు ఆ ఆసుపత్రిని ప్రారంభించారు. విదర్భా ప్రాంతంలోని ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందించనుంది...ఈ హాస్పిటల్. గడ్చిరౌలి, గోండియా, మెల్‌ఘాట్ లాంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర పర్యటన ముగిసిన వెంటనే ఆయన గోవా వెళ్లనున్నారు. 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్‌లో పాల్గొననున్నారు. గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్...గోవా పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
In Goa, I will be addressing the 9th World Ayurveda Congress. I will also be inaugurating the Mopa International Airport, Goa. This airport will promote the local economy and be a major boost for tourism. pic.twitter.com/DJaanG32Jh
— Narendra Modi (@narendramodi) December 10, 2022