News
News
X

Viral News: భార్యను కాటేసిన పాము- సీసాలో పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త!

Viral News: తన భార్యను పాము కరిస్తే ఓ వ్యక్తి ఆ స్నేక్‌ను బాటిల్‌లో పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఎందుకో తెలుసా?

FOLLOW US: 

Viral News: సాధారణంగా పాము కాటేస్తే ఏం చేస్తాం? వెంటనే విషం పైకి ఎక్కకుండా కాటేసిన చోటి కన్నా కొంచెం పైన ఏదైనా గుడ్డతో గట్టిగా కడతాం. తర్వాత బాధితుడ్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ వ్యక్తి డాక్టర్లే అవాక్కయ్యేలా చేశాడు.

ఇదీ జరిగింది

ఉత్తర్‌ప్రదేశ్‌ అఫ్జల్ నగర్‌లో ఓ వ్యక్తి  తన భార్యను పాము కరిస్తే.. భార్యతో పాటు, ఆ పామును సీసాలో వేసి బంధించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ పామును చూసి వైద్య సిబ్బంది అవాక్క‌య్యారు. పామును ఆసుపత్రికి ఎందుకు తెచ్చావ్? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆ భ‌ర్త ఇచ్చిన స‌మాధానం విని అంతా అవాక్కయ్యారు. 

ఇదేందిరా సామీ

అఫ్జల్ నగర్‌లో నివసించే రామేంద్ర‌ యాద‌వ్ భార్య‌ను పాము కాటేసింది. దీంతో అక్కడే ఉన్న రామేంద్ర యాదవ్ ఆ పామును ప‌ట్టుకొని ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. భార్య‌తోపాటు పామును కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అత‌డిని ప్ర‌శ్నించారు.

"నా భార్య‌కు ఏ పాము క‌రిచింద‌ని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును తీసుకొచ్చాను. ఇక ఏ పాము క‌రిచిందో మీరే చూసుకొని వైద్యం చేయొచ్చు" అని స‌మాధాన‌మిచ్చాడు. ఈ ఆన్సర్ విని అక్కడున్న వైద్య సిబ్బంది షాకయ్యారు. పాముకు ఊరిరాడేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు చేశాడు రామేంద్ర యాదవ్. .

విడిచిపెట్టేది లేదు

అంతేకాదు అత‌ని భార్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకే పామును స‌మీపంలోని అడ‌విలో విడిచిపెడ‌తాన‌ని రామేంద్ర యాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇటీవల

బిహార్‌లో ఇటీవల నాలుగేళ్ల బాలుడిని కరిచి ఓ పాము క్షణాల్లోనే మృతి చెందింది. బిహార్​లోని గోపాల్​గంజ్​లో బుధవారం ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చుట్టు పక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడడానికి వచ్చారు.

Also Read: Gleycy Correia Passes Way: టాన్సిల్స్‌ తీస్తే చనిపోతారా? పాపం, మాజీ మిస్ బ్రెజిల్‌కు ఏమైంది?

Also Read: Tweet on Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్‌జీవీ వివాదాస్పద ట్వీట్- భాజపా ఫైర్!

Published at : 24 Jun 2022 05:03 PM (IST) Tags: Uttarpradesh Unnao Man carries snake to hospital

సంబంధిత కథనాలు

Independence Day 2022 :  సాహిత్యం నుంచి సమాజసేవ వరకూ  - నోబెల్ గెలుచుకున్న భారతీయుల గురించి తెలుసా ?

Independence Day 2022 : సాహిత్యం నుంచి సమాజసేవ వరకూ - నోబెల్ గెలుచుకున్న భారతీయుల గురించి తెలుసా ?

Achievements At 75 : స్వాతంత్య్రానికి వజ్రోత్సవానికి మధ్య భారత్ పురోగమనం - దేశం ఎంత సాధించిందంటే ?

Achievements At 75 :  స్వాతంత్య్రానికి వజ్రోత్సవానికి మధ్య భారత్ పురోగమనం -  దేశం ఎంత సాధించిందంటే ?

Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి

Rajasthan News: భక్తుల రద్దీతో ఆలయంలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

Rajasthan News: భక్తుల రద్దీతో ఆలయంలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

టాప్ స్టోరీస్

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?