News
News
X

Thegimpu Movie Review - 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?

Thegimpu Review Telugu / Thunivu Telugu Review : తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో అజిత్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'తెగింపు'. ఈ రోజు విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : తెగింపు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అజిత్ కుమార్, మంజూ వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, జాన్ కొక్కెన్, అజయ్, ప్రేమ్ కుమార్, భగవతి పెరుమాళ్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : నీరవ్ షా 
సంగీతం : జిబ్రాన్ 
నిర్మాత : బోనీ కపూర్, జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం : హెచ్. వినోద్
విడుదల తేదీ: జనవరి 11, 2022

అజిత్ (Ajith) హీరోగా నటించిన తమిళ సినిమా 'తునివు' (Thunivu Review). దీనిని తెలుగులో 'తెగింపు' (Thegimpu Review)గా అనువదించారు. హిందీ హిట్ 'పింక్' తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై', 'వలిమై' తర్వాత అజిత్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రమిది. సంక్రాంతి కానుకగా ఈ రోజు తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Thegimpu Movie Story): విశాఖలోని యువర్ బ్యాంకు లాకర్‌లో 1000 కోట్ల నగదు ఉంచడానికి రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇస్తుంది. ఆ నిబంధనలు మీరి, అనుమతులకు విరుద్ధంగా రూ. 500 కోట్లు డిపాజిట్స్ తీసుకుంటారు. ఆ డబ్బును కొట్టేయడానికి అసిస్టెంట్ కమిషనర్ (అజయ్) ప్లాన్ చేస్తాడు. అయితే, బ్యాంకులోకి వెళ్ళిన అతడి మనుషులను డార్క్ డెవిల్ నెట్వర్క్ చీఫ్ (అజిత్) తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. కథలోకి వెళ్తున్న కొద్దీ డబ్బులు కొట్టేయాలనే ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ వెనుక ఎవరు ఉన్నారు? అనేది బయటకు వస్తుంది. వాళ్ళు ఎవరు? బ్యాంకు బయట డార్క్ డెవిల్ నెట్వర్క్‌కు సపోర్ట్ చేస్తున్న టీమ్ మెంబర్ రమణి (మంజూ వారియర్) ఎవరు? వాళ్ళు ఎందుకు బ్యాంకులో డబ్బు మీద కన్నేశారు? 500 కోట్ల నుంచి 25 వేల కోట్లకు స్కామ్ ఎలా బయటకు వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ : 'తెగింపు' ట్రైలర్ చూస్తే... అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని అర్థం అవుతుంది. 'నీకు సిగ్గు లేదా?' అంటే 'లేదు' అని చెప్పడం, నెగెటివ్ షేడ్ రోల్ 'గ్యాంబ్లర్' రోజులు గుర్తు తెచ్చింది. దాంతో అజిత్ అభిమానులు ఈ 'తెగింపు' మీద అంచనాలు పెట్టుకున్నారు. ఫస్టాఫ్ చూస్తే... వాళ్ళకు కావాల్సిన స్టఫ్ అందించడం మీద దర్శకుడు హెచ్. వినోద్ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.

'తెగింపు' ఫస్టాఫ్‌లో కథ పెద్దగా లేదు. కానీ, ఒక్కో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళడంతో ఏదో జరగబోతుందని ఓ క్యూరియాసిటీ మైంటైన్ అవుతూ వెళ్ళింది. మీమ్ పేజీలను దర్శకుడు వినోద్ బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. మీమ్ రిఫరెన్సులు, కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే వచ్చే ప్రాసెస్, మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చివరలో వాయిస్ వచ్చినట్లు అజిత్ మాట్లాడటం బావుంది. పనిలో పనిగా మీడియా మీద కూడా కొన్ని సెటైర్లు వేశారు. అసలు కథకు, బ్రేక్ తర్వాత సన్నివేశాలకు వచ్చేసరికి ఆడియన్స్ డిజప్పాయింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 

బ్యాంకును అడ్డం పెట్టుకుని వేల కోట్ల స్కామ్ చేసిన వైట్ కాలర్ క్రిమినల్‌ను ఓ వ్యక్తి ఎలా బయట పెట్టాడు? అనేది 'తెగింపు' బేసిక్ స్టోరీలైన్. 'సర్కారు వారి పాట' థీమ్ గుర్తుకు వచ్చిందా? అయితే... మహేష్ బాబు సినిమా ట్రీట్మెంట్ డిఫరెంట్. 'తెగింపు' ట్రీట్మెంట్ డిఫరెంట్. దీన్ని ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో దర్శకుడు తెరకెక్కించారు. కాకపోతే... కొన్ని సిమిలారిటీస్ కనబడతాయి. ఫస్టాఫ్ కూడా '9 అవర్స్' వెబ్ సిరీస్ (మల్లాది రాసిన '9 గంటలు' నవల ఆధారంగా తీశారు) తరహాలో ఉంటుంది. స్టోరీ లైన్ పక్కన పెడితే... 'బీస్ట్' కూడా ఇంతే! ఆ సినిమాలో హీరో ఓ మాల్‌లో ఉండి ఫైట్ చేస్తారు. ఇందులో హీరో బ్యాంకులో ఉండి ఫైట్ చేస్తారు. ఆ థీమ్, యాక్షన్ మూడ్ సేమ్ అనిపిస్తుంది. 

అజిత్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని వినోద్ హీరో గెటప్ అండ్ మేనరిజమ్స్ డిజైన్ చేశారు. కథ మీద మాత్రం కాన్సంట్రేట్ చేయలేదు. ఫస్టాఫ్ యాక్షన్ బ్లాక్స్ & కామెడీతో పాస్ అయిపొయింది. సెకండాఫ్ స్టార్టింగులో అనవసరమైన సాంగ్, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రెగ్యులర్ ఫార్మటులో ఉండటంతో బోర్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌లో అయితే లాజిక్స్ పక్కన పడేశారు. యాక్షన్ పేరుతో విధ్వంసం సృష్టించారు. 

టెక్నికల్ విషయాలకు వస్తే... సినిమాటోగ్రఫీ ఓకే. జిబ్రాన్ నేపథ్య సంగీతం బావుంది. కొన్ని సన్నివేశాల్లో కిర్రాక్ ఆర్ఆర్ ఇచ్చారు. సాంగ్స్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చవు.  

నటీనటులు ఎలా చేశారంటే? : అజిత్ నటనలో ఫైర్ ఉంది. నెగెటివ్ షేడ్ రోల్ వస్తే చెలరేగిపోతారు. ఫస్టాఫ్ అంతా విలన్ టైపులో కనిపించే హీరోలా సూపర్బ్ స్టైల్, మేనరిజమ్స్ చూపించారు. సెకండాఫ్‌లోనూ క్యారెక్టర్ పరంగా ముందుకు వెళ్ళారు. బ్యాంకులో వేసిన స్టెప్స్, విలనీ స్మైల్ అభిమానులకు నచ్చుతాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకు తక్కువ స్పేస్ ఉంటుంది. ఇందులోనూ మంజూ వారియర్ స్క్రీన్ స్పేస్ తక్కువే. అయితే... పాటలకు, హీరోతో రొమాంటిక్ సన్నివేశాలకు ఆమెను పరిమితం చేయలేదు. అందుకు, దర్శకుడికి థాంక్స్ చెప్పాలి. లిమిటెడ్ స్క్రీన్ స్పేస్‌లో మంజూ వారియర్ మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఫైట్ సీక్వెన్సులో బావున్నారు. సముద్రఖని, అజయ్, జాన్ కొక్కెన్ తదితరులవి రెగ్యులర్ రోల్స్. కానీ, కథలో సెట్ అయ్యాయి. బ్యాంకు మేనేజర్ రోల్ చేసిన నటుడు కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తారు.     

Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే? 

చివరగా చెప్పేది ఏంటంటే? : అజిత్ వీరాభిమానులకు మాత్రమే 'తెగింపు'. అదీ యాక్షన్ ప్రేమికులకు, ఎటువంటి యాక్షన్ అయినా సరే స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వాళ్ళకు! ఫస్టాఫ్ యాక్షన్ అయితే... సెకండాఫ్ సినిమా టోన్, మూడ్ మొత్తం సందేశం వైపు వెళుతుంది. రెండిటిని బ్యాలన్స్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అసలు కథలోకి అడుగు పెట్టకుండా (ఫస్టాఫ్) అజిత్ డ్యాన్సులు, ఫైట్లు చేసినప్పుడు సినిమా బావుంది. కథలోకి అడుగు పెట్టాక కంగాళీ అయ్యింది. రొటీన్ మెసేజ్ వచ్చింది. 

Also Read : ఇదీ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఘనత - గోల్డెన్ గ్లోబ్‌కు ఇండియన్ ట్రెడిషనల్ టచ్

Published at : 11 Jan 2023 11:20 AM (IST) Tags: ABPDesamReview Manju Warrier Thegimpu Review Ajith's Thunivu Review Thegimpu Telugu Movie Thegimpu Rating

సంబంధిత కథనాలు

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam