అన్వేషించండి

Period Friendly Travel Tips : పీరియడ్స్​లో ఉన్నప్పుడు ప్రయాణం చేయాల్సివస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Travelling on Your Period : నెలసరి సమయంలో జర్నీ చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిని ఫాలో అవ్వడం వల్ల సౌకర్యంగా గమ్యానికి చేరుకోవచ్చంటున్నారు. అవేంటంటే..

Travelling During Peroids : పీరియడ్స్​ సమయంలో చాలామందికి బయటకు వెళ్లాలనిపించదు. బెడ్​ మీద నుంచి లేవబుద్ది కూడా కాదు. కానీ ఒక్కోసారి వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో.. పీరియడ్స్​లో ఉండగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

జర్నీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పీరియడ్స్ వచ్చినా.. వచ్చే అవకాశమున్నా.. ఆ సమయంలో మీరు జర్నీ చేస్తుంటే కచ్చితంగా అవసరమైన వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. శానీటరీ ప్యాడ్స్ లేదా టాంపాన్స్ కంఫర్ట్​బుల్​గా ఉంటే మెన్​స్ట్రువల్ కప్స్ ప్యాక్ చేసుకోవాలి. నొప్పిని తగ్గించే ప్రొడెక్ట్స్, క్లీనింగ్, హైజీన్​ కోసం వాడే ప్రొడెక్ట్స్​ని ప్యాక్ చేసుకోవాలి. అలాగే కంఫర్ట్​బుల్​గా ఉండే దుస్తులు వేసుకోవాలి. జర్నీ సమయంలో చిరాకు రాకుండా, ఇబ్బంది పెట్టే బిగుతు దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. హైడ్రేటెడ్​గా ఉండేందుకు అవసరమైన నీటిని లేదా ఫ్లూయిడ్స్​ని తీసుకోవాలి. వీటివల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి తగ్గుతుంది. 

జర్నీలో ఉన్నప్పుడు

ప్రయాణం చేసే సమయాన్ని బట్టి.. మీరు రెస్ట్​రూమ్​కి వెళ్లగలిగే సౌలభ్యాన్ని బట్టి శానిటరీ ప్రొడెక్ట్స్​ తీసుకువెళ్లాలి. మెన్​స్ట్రువల్ కప్​లు లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ప్యాడ్స్ కంటే మంచి ఆప్షన్​గా చెప్పొచ్చు. రీ యూజబుల్​ కాబట్టి.. తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. జర్నీ మధ్యలో మీరు వెళ్లే వాష్​ రూమ్స్​ శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అశుభ్రంగా ఉండే ప్రదేశాలను అవాయిడ్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో టాయిలెట్ స్ప్రే లేదా టిష్యూల సహాయంతో ఉపయోగించుకోవాలి. పీరియడ్స్ నొప్పినుంచి ఉపశమనం కలిగించే హీట్ ప్యాడ్స్ లేదా హీట్ ర్యాప్స్​, పలురకాలు క్రీమ్​లు ఉపయోగించవచ్చు. ఇవి జర్నీని కాస్త తేలిక చేస్తాయి. 

అడిషనల్ టిప్స్

హీటింగ్ ప్యాడ్ లేదా హాట్ వాటర్ పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పొత్తికడుపు వద్ద కాస్త వేడిని కాపడంగా పెడితే.. రిలాక్స్ అవుతారు. ఒత్తిడిని, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్స్, ధ్యానం, యోగా వంటివి చేయొచ్చు. సింపుల్ స్ట్రెచ్​లు చేయడం, పడుకోవడం వంటివి చేయడం వల్ల ఇబ్బంది కాస్త తగ్గుతుంది.

ఆ విషయాలు మరచిపోవద్దు.. 

శానిటరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా మార్చండి. లేదంటే ఇన్​ఫెక్షన్లు, దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ. ప్రతి 4 నుంచి 8 గంటలకోసారి శానిటరీ ఉత్పత్తులు మార్చాలి. పబ్లిక్ రెస్ట్​రూమ్​లు వినియోగించేప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బ్యాక్టీరియా పెరుగుదలను కంట్రోల్ చేయడానికి శుభ్రమైన, డ్రైగా ఉండే దుస్తులు వేసుకోవాలి. తడిలేకుండా, కంఫర్ట్​బుల్​గా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది. 

జర్నీలో మెడికల్ స్టోర్స్ లేదా ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. నొప్పి ఎక్కువగా లేదా బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే వైద్యుల సహాయం తీసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఫార్మసీలకు వెళ్లండి. ఈ చిట్కాలు అనుసరిస్తే పీరియడ్స్​లో ఉన్నప్పుడు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని మీరు చేయవచ్చు. 

Also Read : NNN లేదా ఇతర కారణాల వల్ల ఆ పనికి గ్యాప్ వస్తే.. మళ్లీ స్టార్ట్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget