![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Speech Fasting: నోరు మూసుకుంటే బోలెడంత ఆరోగ్యమట, ట్రెండ్ అవుతున్న స్పీచ్ ఫాస్టింగ్ కాన్సెప్ట్
Speech Fasting: ప్రస్తుతం స్పీచ్ ఫాస్టింగ్ కాన్సెప్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
![Speech Fasting: నోరు మూసుకుంటే బోలెడంత ఆరోగ్యమట, ట్రెండ్ అవుతున్న స్పీచ్ ఫాస్టింగ్ కాన్సెప్ట్ Speech Fasting Help You Become Healthier Happier Says Reports Speech Fasting: నోరు మూసుకుంటే బోలెడంత ఆరోగ్యమట, ట్రెండ్ అవుతున్న స్పీచ్ ఫాస్టింగ్ కాన్సెప్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/10/abc04c3a8c071e672ad4fdfbb50769981712751540035517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
What is Speech Fasting: ఊరుకోవడం అంత ఉత్తమం ఇంకేమీ లేదు అంటారు కొందరు. అలా అని ప్రతిసారీ అలా ఊరుకుంటే "మాట్లాడడం చేతకాదేమో" అనే భయంతో చాలా మంది ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడేస్తారు. నిజానికి మౌనం చేతకానితనం కాదు..అదే ఆరోగ్యకరం అంటున్నారు కొంతమంది హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. ఈ మధ్య కాలంలో చాలా మంది Speech Fasting ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అంటే...ఓ రోజంతా సైలెంట్‌గా ఉండడం. కాస్త కష్టమే అయినా కొంత మంది చాలా స్ట్రిక్ట్‌గా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల ఓ స్కాటిష్ సింగర్ లూలూ (Singer Lulu) ఈ స్పీచ్ ఫాస్టింగ్ గురించి చెప్పింది. అప్పటి నుంచి ఇది ట్రెండ్ (Benefits of Speech Fasting) అవుతోంది.
సింగర్స్ తమ వోకల్స్‌ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. Vocal Healthపై ఎక్కువగా ఫోకస్ పెడతారు వాళ్లు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో ఒకటి ఈ స్పీచ్ ఫాస్టింగ్. తన గొంతు పాడు కాకుండా, ఇలా ఓ రోజంతా సైలెంట్‌గా ఉండి వోకల్స్‌కి రెస్ట్ ఇస్తానని చెప్పారామె. ఆమె చెప్పడం వల్ల ఇప్పుడీ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నప్పటికీ...ఎక్స్‌పర్ట్‌లు ఎప్పుడో స్పీచ్ ఫాస్టింగ్‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. 2006లో ఓ ఆసక్తికర స్టడీ వెలుగులోకి వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం..మనకి ఇష్టమైన పాటలు విన్నాక రెండు నిముషాల పాటు సైలెంట్‌గా ఉంటే హార్ట్ రేట్‌తో పాటు బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ (Blood Pressure Levels) తగ్గిపోయాయి.
హెల్త్‌కి మంచిదట..
ఆ తరవాత 2021 లోనూ ఓ రిపోర్ట్ స్పీచ్ ఫాస్టింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఎక్కువ శ్రద్ధతో చేయాల్సిన పనులు ఎలాంటి శబ్దాలు లేని వాతావరణంలోనే సమర్థంగా చేయగలుగుతున్నారని వెల్లడించింది. అలాంటి క్లైమేట్‌లో పని చేసే వాళ్లలో వర్క్ లోడ్ తక్కువగా ఉండడంతో పాటు స్ట్రెస్ హార్మోన్ cortisol లెవెల్స్ తక్కువగా ఉన్నాయని వివరించింది. మాట్లాడకుండా ఉండడం వల్ల స్ట్రెస్ తగ్గడమే కాదు. ఓ పనిపై ఫోకస్ పెరుగుతుంది. మెదడు పని తీరుని మెరుగు పరుస్తుంది. ఇన్‌సోమ్నియా (Insomnia) లాంటి వ్యాధులను కంట్రోల్ చేయడానికి స్పీచ్ ఫాస్టింగ్‌కి మించిన బెస్ట్ సొల్యూషన్ లేదని అంటున్నాయి రిపోర్ట్‌లు. అంతే కాదు. తక్కువగా మాట్లాడేవాళ్లని ఎక్కువ మంది ఇష్టపడతారట. అలా సైలెంట్‌గా ఉండడం వల్ల అవతలి వాళ్లు ఏం చెబుతున్నారో వినడం అలవాటవుతుంది.
అయితే...ఇలా రోజూ సైలెంట్‌గా ఉండడం చాలా కష్టం. ప్రాక్టికల్‌గా ఇది సాధ్యం కాదు కూడా. ఇది ఒక్కోసారి మన చుట్టూ ఉన్న మనుషులతో మనకు దూరం పెంచే ప్రమాదమూ ఉంది. అందుకే ఎక్కువ రోజుల పాటు ఈ స్పీచ్ ఫాస్టింగ్‌ని ఫాలో అవ్వకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎప్పుడో ఓ సారి ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల బోలెడంత మేలు జరుగుతుంది. హిందూ ఫిలాసఫీలో Mauna అనే ఓ కాన్సెప్ట్ ఉంది. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం అని చెబుతుందీ సిద్ధాంతం. ఇప్పుడు కొత్తగా రిపోర్ట్‌లు చెబుతున్న విషయమూ ఇదే. సో...మౌనానికి, ఆరోగ్యానికీ ఇలా లింక్ ఉంటుందన్నమాట.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)