Samantha Akkineni Shifting Mumbai : ముంబైలో ఫ్లాట్.. సమంత ప్లాన్ మాములుగా లేదు..
ఈ మధ్యకాలంలో సమంత పేరు బాగా వార్తల్లో నలుగుతోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్యకాలంలో సమంత పేరు బాగా వార్తల్లో నలుగుతోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో నిజమేంటో చైతు-సమంత స్పందిస్తే గానీ చెప్పలేం. త్వరలోనే 'లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్స్ కోసం చైతు మీడియా ముందుకు రావాలి. అప్పుడు కచ్చితంగా చైతుకి ఈ డివోర్స్ ప్రశ్నలు ఎదురవ్వడం ఖాయం. అప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా.. సమంత ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకుందట. 'ది ఫ్యామిలీ సీజన్ 2' వెబ్ సిరీస్ తో సమంతకు మంచి పేరొచ్చింది. దాంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు మొదలయ్యాయని టాక్. నిజానికి సమంతకు బాలీవుడ్ కి వెళ్లాలనే ఆసక్తి, ఆతురత ఎంతమాత్రం ఉండేవి కావు. కానీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కిక్కేంటో ఆమెకి అర్ధమైంది. అందుకే కొన్నాళ్లపాటు అక్కడ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ ని, మేనేజర్ ని నియమించుకుంది సమాచారం.
కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ సమంత ఇటీవలే ప్రకటించింది. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయిందట. సమంత ముంబైకి మకాం మార్చడం వెనుక.. చైతు విడాకులనే విషయం ఏమైనా ఉందా అంటూ కొత్త కోణంలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది సమంత, గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సామ్. ఇందులో సమంతతో పాటు నయనతార కూడా కనిపించనుంది.
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?
Also Read : Tollywood Drug Case: నవదీప్‌ను విచారిస్తున్న ఈడీ.. ఎఫ్-క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు?