(Source: ECI/ABP News/ABP Majha)
చరణ్ కారునే కొన్న ప్రభాస్ హీరోయిన్.. సెలబ్రిటీల క్రష్ ఈ కారుపైనే! ఏకంగా నలుగురు హీరోలు?
బాలీవుడ్ భామ కృతి సనన్ మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్ 600 ఎస్ యూవీ కారును కొనుగోలు చేసింది. ఈ కారును ఇటీవలే టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కొనుగోలు చేయడం విశేషం.
మెర్సిడెస్ ఈ సంవత్సరంలోనే మనదేశంలో లాంచ్ చేసిన మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్ 600 ఎస్ యూవీ సెలబ్రిటీల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఈ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ.2.43 కోట్లుగా(ఎక్స్-షోరూం) ఉంది. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ముంబైలో ఈ కారును డెలివరీ తీసుకుంది. టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కారును కొనుగోలు చేయడం విశేషం.
మొదటి బ్యాచ్ కింద మెర్సిడెస్ మన దేశానికి 50 యూనిట్లు కేటాయించగా అవన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, రణ్ వీర్ సింగ్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే వీటిని కొనుగోలు చేయగా.. ఇప్పుడు కృతి సనన్ కూడా ఆ జాబితాలో చేరింది. కృతి సనన్ దగ్గర ఇప్పటికే ఆడీ క్యూ7, బీఎండబ్ల్యూ 3 సిరీస్ కార్లు ఉన్నాయి.
ఈ సంవత్సరం జూన్‌లో మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్ 600 ఎస్ యూవీ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఎస్ యూవీ కార్లలో ఇది కూడా ఒకటి. ఇందులో బోలెడన్ని లగ్జరియస్ ఆప్షన్లు ఉన్నాయి. స్టాండర్డ్ గా 5-సీటర్ మోడల్ లో మేబాక్ ను అందిస్తున్నప్పటికీ.. వినియోగదారులు 4-సీటర్ మోడల్ ను ఎంచుకుంటే ఈ కారుతో మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని పొందవచ్చు.
ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 12.3 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించారు. మసాజ్ ఫంక్షన్ ఉన్న క్లైమెట్ కంట్రోల్ సీట్లు, ఎంబీయూఎక్స్ రేర్ ట్యాబ్లెట్, ఫోల్డబుల్ టేబుల్స్, షాంపేన్ బాటిల్ పెట్టుకునే స్పేస్ ఉన్న రిఫ్రిజిరేటర్, సిల్వర్ షాంపేన్ ఫ్లూట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
4.0 లీటర్ వీ8 టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఇందులో అందించారు. 550 బీహెచ్ పీ, 730 ఎన్ఎం కూడా ఇందులో ఉన్నాయి. ఈ కారులో 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టం కూడా ఉంది. ఇది అదనంగా 21 బీహెచ్ పీ, 250 ఎన్ఎం టార్క్ ను కూడా అందించనుంది. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను ఇందులో అందించడం విశేషం.
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: ముందు 'మేక్ ఇన్ ఇండియా'.. తర్వాత పన్ను రాయితీ.. ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన కేంద్రం
Also Read: పియాజియో నుంచి సూపర్ బైక్‌లు.. ధర, ఫీచర్లు ఇవే..