Ram Charan New Car: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
కార్లు, బైకులు మార్కెట్లోకి రాగానే సొంతం చేసుకోవాలనుకుంటారు సెలబ్రెటీలు. పోటాపోటీగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు చెర్రీ కొన్న కొత్త కారు వీడియో వైరల్ అవుతోంది.
![Ram Charan New Car: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే.. Ram Charan New Car: Mega Powerstar Ram Charan New Luxury Car Mercedes Maybach GLS600 Know Price Features Video Viral Ram Charan New Car: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/13/f153259c9bd67ae6379fa14c983c2d5c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మన హీరోలకు మోటార్ వెహికల్స్ అంటే భలే మోజు. అది కారైనా, బైకైనా రయ్ రయ్ మని చక్కర్లు కొట్టనిదే తగ్గేదేలే అంటారు. అందుకే మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం మోటార్ వెహికల్ ని సొంతం చేసుకుంటారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ ‘లంబోర్ఘిని’ ఊరూస్ మోడల్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన విషయం ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలుసుకదా. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 ను సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడం విశేషం.
Megapower Star @AlwaysRamCharan receives his new Mercedes Maybach GLS 600 #RamCharan pic.twitter.com/AV6kK3K2UB
— BA Raju's Team (@baraju_SuperHit) September 12, 2021
ట్రక్ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా. చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లుఉన్నాయి.
Also read: కాణిపాకం బ్రహ్మోత్సవాలు... నెమలి వాహనంపై దర్శనమిచ్చిన వినాయకుడు
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ‘ఆచార్య’ తో బిజీగా ఉన్న చరణ్..సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇది శంకర్ ‘ఒకేఒక్కడు’ సినిమాకి సీక్వెల్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అప్పటి రాజకీయ అంశాలను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ‘ఒకేఒక్కడు’ తమిళ, తెలుగు భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదే సినిమాను హిందీలో ‘నాయక్’ అనే పేరుతో రీమేక్ చేశాడు శంకర్. ఇప్పుడు చెర్రీతో చేస్తున్న సినిమా…దీనికి సీక్వెల్ అంటున్నారు. ఈ మూవీలో చెరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
Also Read: మళ్లీ నీట మునిగిన ఆవ భూములు.... ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరొచ్చి సమాధానం చెప్తారని ఓ వ్యక్తి వీడియో
Also read: ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)