News
News
X

Dasara Festival 2021: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

FOLLOW US: 
 
దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ ఇదే కాలక్రమంలో దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి   ఉహోత్సవాల్లో పరమార్థం అని చెబుతారు పండితులు. ఏటా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి మస్తాబవుతోంది. వచ్చేనెల 7 నుంచి ప్రారంభంకానున్నాయని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు.

ఏ రోజ ఏ అలంకారం

అక్టోబరు 7 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.

News Reels

అక్టోబరు 8 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.

అక్టోబరు 9 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.

అక్టోబరు 10 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.

అక్టోబరు 11 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.

అక్టోబరు 12 శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).

అక్టోబరు 13 శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).

అక్టోబరు 14 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).

అక్టోబరు 15 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

        అక్టోబరు 11  సోమవారం శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్సైట్ లో సందర్శించవచ్చని చెప్పారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు. ఈ సారి దసరా ఉత్సవాలలో జగన్మాత దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కుంకుమతోపాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

Also read: ఉదయం బాలిక రూపంలో మధ్యాహ్నం యువతిగా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపించే అమ్మవారు

Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!

Also Read: తెలుగు సంవత్సరాల పేర్లకి నారదుడికి లింకేంటి?

Also Read: త్రిశంకు స్వర్గం@ విశ్వామిత్ర క్రియేషన్స్...

Published at : 13 Sep 2021 09:04 AM (IST) Tags: Dasara Festival 2021 October 7th on wards Arrangements Viajayawada Indrakeeladri

సంబంధిత కథనాలు

Christmas 2022: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!

Christmas 2022: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!

Christmas 2022: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె

Christmas 2022: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె

Love Horoscope Today 6th December 2022: ఈ రాశి జంటల మధ్య అనవసర వివాదాలు

Love Horoscope Today 6th December 2022:  ఈ రాశి జంటల మధ్య అనవసర వివాదాలు

Horoscope Today 6th December 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది, డిసెంబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th  December 2022:  ఈ రోజు ఈ రాశివారి జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది, డిసెంబరు 6 రాశిఫలాలు

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th  December 2022:  ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

Siddipet District News: ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఈటల రాజేంద్ర

Siddipet District News: ఆ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఈటల రాజేంద్ర

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!

Gujarat Polls: భాజపాకు కేజ్రీవాల్ షాకిస్తారా? గుజరాత్‌లో కాంగ్రెస్‌తో ఆమ్‌ఆద్మీ పొత్తు!