Dharadevi Mandir In Uttarakhand: ఉదయం బాలిక రూపంలో మధ్యాహ్నం యువతిగా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపించే అమ్మవారు

ఆ గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగానూ, మధ్యాహ్నం యువతిగా , సాయంత్రం వృద్ధురాలిగా మారుతుంది. శక్తివంతమైన ఈ ఆలయం ఉత్తరాఖండ్ గర్వాల్-శ్రీనగర్ ప్రాంతంలో అలకందా నది ఒడ్డున ఉంది...ఆ విశిష్టతలు తెలుసుకుందా...

FOLLOW US: 

భారతదేశంలో శక్తివంతమైన పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటి వెనుక చాలా రహస్యాలున్నాయి. అలాంటి ఆలయమే ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ జరిగే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారంతా. ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి.. చార్ ధామ్ క్షేత్రాలకు నాయక. బద్రీనాథ్‌కు శ్రీనగర్‌కు వెళ్లే దారిలో కల్యాసౌర్ గ్రామంలో అలకానంద నది ఒడ్డున ఉంది ధారీదేవి ఆలయం. అమ్మవారు..అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని అక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం గురించి మహాభారతంలో ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలో పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో ఉంది. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి. 

భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత అయిన ధారాదేవిని ధిక్కరిస్తే అంతే కీడు జరుగుతుందని చెబుతారు. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ రాజు పడగొట్టాలని ప్రయత్నించాడు. ఆ టైంలోనే కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయిందని స్థానికులు చెబుతారు. ఆ ప్రకృతి విపత్తు వేల మందిని బలితీసుకుందని కూడా ప్రచారంలో ఉంది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయాడంట. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలిగించడమే ప్రధాన కారణం అని చెబుతారు. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలో కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయ తాండవం చేసింది. అలకనంద ఉగ్రరూపంలో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత మళ్లీ విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్టించారు.

గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ధారాదేవి ఆలయం...గర్భగుడిలో అమ్మవారు సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉందని చెబుతారు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు.  ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తరదిక్కుకి అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రభోదిస్తాడు. ఫలితంగా ఉత్తరదిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుందిని చెబుతారు. 

ఇక ఆలయంలో అమ్మవారి  గురించి చెప్పుకుంటే.....ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయసు మహిళగా, సాయంత్రం వృద్ధురాలిగా మారుతుంది. స్త్రీ రూపంలోకి మారుతుంది. అమ్మవారి శక్తి ఎలా ఉంటుందో ఇంతకన్నా ఏం చెప్పగలం అంటారు స్థానికులు...

Tags: Girl In The Morning Young Woman In The Afternoon Old Woman In The Evening Powerful Goddess Dharadevi Mandir In Uttarakhand

సంబంధిత కథనాలు

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Horoscope Today 17th May 2022: ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 17th May 2022:  ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Astrology:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి

Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి

Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?

Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?