News
News
X

Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ

‘పుష్ప’ సినిమా షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న బన్నీ.. గోకవరంలో రోడ్డు పక్కన చిన్న దుకాణంలో టిఫిన్ ఆరగిస్తున్న వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

FOLLOW US: 
 
తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్న స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో బన్నీ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ‘పుష్ప’ షూటింగ్ అల్లు అర్జున్ ఇటీవల కాకినాడ వచ్చాడు. అయితే, వర్షాల వల్ల షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో బన్నీ.. కాకినాడ పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశాడు. ఇందులో భాగంగా బన్నీ.. రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి వద్దకు వెళ్లి అల్పాహారాన్ని తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

ఇటీవల బన్నీ.. గోపిచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమాను కూడా థియేటర్‌కు వెళ్లి వీక్షించాడు. అనంతరం షూటింగ్ కోసం గోకవరం వెళ్లిన బన్నీ.. రోడ్డు పక్కన కనిపించిన టిఫిన్ బండి వద్ద ఆగాడు. కారు నుంచి దిగి నేరుగా టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. తనకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేసుకుని తిన్నాడు. ఆ తర్వాత తానే స్వయంగా డబ్బులు చెల్లించి వెళ్లిపోయాడు. దీంతో ఆ షాపు యజమాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. బన్నీ సింప్లిసిటీ చూసి అభిమానులు పొంగిపోతున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

వీడియో:

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం షూటింగ్ మొత్తం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందాన్న నటిస్తోంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండవ భాగం కోసం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. డిసెంబరు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. 

News Reels

‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ‘పుష్ప’ సినిమా గురించి వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. అలాగే బన్నీ కూడా ఈ చిత్రం షూటింగ్ ముగిసేవరకు మరే చిత్రం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయి. ‘పుష్ప’లో ఊర మాస్ గెటప్‌లో బన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పట్లో తన లుక్ మార్చుకోవడం కుదరదని చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ ముగించుకుని.. బన్నీ కొత్త చిత్రాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడు. 

Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల

Published at : 13 Sep 2021 01:58 PM (IST) Tags: Allu Arjun అల్లు అర్జున్ Allu Arjun Breakfast Allu Arjun Tiffin centre Allu Arjun tiffin Allu Arjun in Kakinada Allu Arjun in Gokavaram Pushpa Shooting

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December  9th Update: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

Guppedantha Manasu December 9th Update: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

Rashmika Mandanna: కన్నడలో బ్యాన్‌పై స్పందించిన రష్మిక, ఏమందో తెలుసా?

Karthika Deepam December 9th Update: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం

Karthika Deepam December 9th Update: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం

Ennenno Janmalabandham December 9th: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక

Ennenno Janmalabandham December 9th: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక

Gruhalakshmi December 9th: తులసి మాట విని భార్యకి సోరి చెప్పిన నందు- కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి లాస్య స్కెచ్

Gruhalakshmi December 9th: తులసి మాట విని భార్యకి సోరి చెప్పిన నందు- కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి లాస్య స్కెచ్

టాప్ స్టోరీస్

Telangana Trending News 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Telangana Trending News 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ- ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!

కొడాలి నాని, వంగవీటి రాధ భేటీ-  ఏపీ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ!

శశికళ మృతికి ఎవరి కారణం ? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

శశికళ మృతికి ఎవరి కారణం ? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

IND vs BAN: టీమిండియా వరుస సిరీస్ ల ఓటమి- ఆటతీరే కాదు ఇంకా ఎన్నో కారణాలు!

IND vs BAN:  టీమిండియా వరుస సిరీస్ ల ఓటమి- ఆటతీరే కాదు ఇంకా ఎన్నో కారణాలు!