(Source: ECI/ABP News/ABP Majha)
Sai Dharam Tej Health Update: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల
రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు. తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు.
సాయిధరమ్ తేజ్ ను వెంటిరేటర్‌పై ఉంచే కాలర్ బోన్ సర్జరీ చేశారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఈ సర్జరీ జరిగింది. తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు వెల్లడించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని ఇప్పటికే వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా జంక్షన్‌కు వెళ్లే మార్గంలో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా తీగల వంతెనపై రోడ్డుపై పడిపోయారు. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను వెంటనే దగ్గర్లో ఉన్న మెడికవర్ అనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని వాహనాన్ని అదుపుచేయలేకపోయారని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయిధర్మతేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు. గ్రామంలో ముంగర్లమ్మవారి గుడివద్ద సాయిధర్మతేజ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అభిమానులు. తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యామని చెబుతున్నారు. విఘ్నేశ్వరుడు, అమ్మవారి కృప సాయి ధర్మతేజ్‌కు ఉండి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.
Also Read: Sai Dharam Tej: తేజ్‌కు ఆంజనేయుడి అండ.. ఆ చిరంజీవే కాపాడుతాడంటూ ఫ్యాన్స్ విశ్వాసం, ఆలయాల్లో పూజలు
Also Read: Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్‌పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
Also Read: Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్