News
News
X

Sai Dharam Tej: తేజ్‌కు ఆంజనేయుడి అండ.. ఆ చిరంజీవే కాపాడుతాడంటూ ఫ్యాన్స్ విశ్వాసం, ఆలయాల్లో పూజలు

బతుకునివ్వడమే కాదు బతుకుపై భరోసా కల్పించే దేవుడు ఆంజనేయుడని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకమే ధైర్యాన్నిస్తోందంటున్నారు మెగా అభిమానులు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకునేందుకు ఆంజనేయమంత్రం పనిచేస్తుందటున్నారు.

FOLLOW US: 
 
వాలితో పోరాడలేక రాజ్యాన్ని, భార్యని కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో ప్రాణం తీసుకునేందుకు సిద్ధపడతాడు సుగ్రీవుడు. అప్పటి వరకూ అంతా విన్న హనుమంతుడు ఆ క్షణం సుగ్రీవుడికి నచ్చచెప్పి చావునుంచి తప్పిస్తాడు. ఆ తర్వాత రాముడితో స్నేహాన్ని ఆ తర్వాత రాజ్యం దక్కేలా చేస్తాడు. అశోకవనంలో ఉన్న సీతాదేవి…రాక్షస స్త్రీల హింసను భరించలేక తన జడతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుడు ఆ ప్రయత్నాన్ని విరమింపజేయడమే కాదు.. రాముడు వస్తాడు.. తీసుకెళతాడనే భరోసా ఇస్తాడు. ఇక రామ రావణ యుద్ధం సమయంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల మూర్ఛిల్లిన లక్ష్మణుడి కోసం సంజీవిని తీసుకొచ్చి ప్రాణం పోస్తాడు. అంటే కష్టం వచ్చినప్పుడు దాన్నుంచి తప్పించడమే కాదు..బతుకుపై భరోసా కల్పిస్తాడు ఆంజనేయుడు. ఇప్పుడు మెగా అభిమానుల నమ్మకం కూడా ఇదే. ఆంజనేయుడుని నమ్ముకున్న వారు ఎంతటి సమస్య నుంచి అయినా ఇట్టే బయపడతారని.. సాయి ధరమ్ తేజ్ కూడా త్వరగా కోలుకుంటారని విశ్వాసిస్తున్నారు. ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొడుతూ పూజలు సైతం నిర్వహిస్తున్నారు.

Also read: చెర్రీ కొత్త బిజినెస్.. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ అవుతారా?

వాస్తవానికి ఆంజనేయుడంటే మెగా కుటుంబానికి ఎంత విశ్వాసమో చాలా సందర్భాల్లో చిరంజీవి చెబుతూనే ఉంటారు. ఈ మధ్య ఓ ఇంటర్యూలో కూడా చిరంజీవి ఏమన్నారంటే.. ”నాకు ఆంజ‌నేయ స్వామి అంటే ఎంతిష్టం అంటే ఆయ‌న మాట్లాడాల‌ని అనుకునేతంగా. ఒకానొక ద‌శ‌లో నాకు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న‌తో చెప్పుకునేవాడిని. త‌ర్వాత క్ర‌మంగా ఆంజ‌నేయ‌స్వామి ఎక్క‌డో లేడు.. నాలో ఆంత‌ర్గ‌తంగా ఉన్నాడ‌ని అర్థ‌మైంది. సాధార‌ణంగా మ‌నం స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేట‌ప్పుడు మన‌కు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడే దేవుడు. ఆ దేవుడు ఎక్క‌డో లేడు. మ‌న‌లోనే ఉన్నాడు’’ అన్నారు. అంత భరోసా నిచ్చే దేవుడైన హనుమంతుడే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ని కోలుకునేలా చేస్తాడనే విశ్వాసంతో ఉన్నారు మెగా అభిమానులు.

Also read: ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతోన్న సాయి ధరమ్ తేజ్.. బయటకొచ్చిన వీడియో..

News Reels

శుక్రవారం రాత్రి బైక్ యాక్సిడెంట్ కి గురైన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎలాంటి ప్రమాదం లేదని తేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అటు చిరంజీవి కూడా తన మేనల్లుడు క్షేమంగా ఉన్నాడని అభిమానులు ఆందోళన చెందవద్దని చెప్పారు. సినీ సెలబ్రెటీలంతా తేజ్ గెట్ వెల్ సూన్ అని ట్వీట్స్ చేశారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీని ఆంజనేయుడు కాపాడతాడన్నది అభిమానుల విశ్వాసం.

Also Read: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్

Published at : 12 Sep 2021 08:38 AM (IST) Tags: Sai Dharam Tej Health Update Megafans Faith May Lord Hanuman Fast Recovery

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?