Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్
పవన్ కళ్యాణ్ అంటే సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణం. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ధరమ్ తేజ్‌తోనే ఎక్కువ బాండ్ ఉంది. అందుకే, పవన్ సూచనను పాటించి ఈ రోజు తేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, తేజ్ అపస్మారక స్థితి నుంచి స్పృహలోకి వచ్చాడా లేదా అనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో మెగా అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే, తేజ్ బైకు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. హెల్మెట్ లేకపోతే.. తలకు బలమైన గాయాలు తగిలేవని తెలుస్తోంది. హెల్మెట్ ధరించినా సరే తేజ్ కంటికి గాయమైంది. దీన్ని బట్టి చూస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు బైకు నడిపినా తప్పకుండా హెల్మెట్ ధరిస్తాడు. ఇందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణే. తేజ్ ఓ ఇంటర్వ్యూలో బైకుల మీద తనకు ఉండే ఇష్టం గురించి చెప్పాడు. ‘‘బైకు ఏదో కొన్నారంట. స్పెషల్‌గా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారితోనే షేర్ చేసుకున్నారంట’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘‘నా ఫస్ట్ లోకోమోటివ్ పవన్ కళ్యాణ్ గారి అవేంజర్ బైక్. చిన్నప్పటి నుంచి నాకు బైకులంటే ఇష్టం. దాని మీద కూర్చొని ఫొటోలు దిగడం. వయస్సు వచ్చిన తర్వాత దాని మీద బయటకు వెళ్లడం.. పెట్రోల్ అయిపోతే తోసుకుంటూ రావడం.. అవన్నీ జరుగుతూ ఉండేవి. మొత్తానికి నేను కూడా హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుకున్నాను. దాన్ని కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్లి.. ఇది నా బైక్ అని చూపించాను. ఈ సందర్భంగా ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్.. హెల్మెట్ ఉందా అని అడిగారు. ఉందడి.. ఫస్ట్ అదే కొన్నాను అని చెప్పాను. బైక్ మీద వెళ్లేప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. బైకు మీద వేగంగా వెళ్లవద్దని కూడా చెబుతారు’’ అని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్వ్యూలో తేజ్ ఏం చెప్పాడో చూడండి:
సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్‌ను ఎంతో అభిమానిస్తాడు. ఆయన చెప్పిన మాటలను వేదంలా భావిస్తాడు. అదే అతడికి శ్రీరామ రక్షగా మారిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఆ సలహా ఇవ్వడం వల్లే తేజ్ బైకు మీద ప్రయాణించేప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరిస్తున్నాడు. తేజ్‌కు ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌కు వెళ్లడం, తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం చూస్తే.. వారి మధ్య ఎంత బాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందటే.. తేజ్, పవన్ కళ్యాణ్‌లు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలో కలుసుకున్నారు. రోజంతా సరదాగా గడిపారు.
Also Read: కెమెరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?
Also Read: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు
Also Read: సాయి ధరమ్ తేజ్ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు