Sai Dharam Tej Health Update: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు స్పందిస్తూ.. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు స్పందిస్తూ.. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 48 గంటలు ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు. అప్పటివరకు ఏవిషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఎందుకంటే బైకు మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావచ్చని, అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని, కాలుకు దెబ్బ తగిలిందని మరో వైద్యుడు తెలిపారు. అయితే, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయన కోసం ప్రార్థిద్దామని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు.
రేపు ఉదయం లేచి మాట్లాడతాడు - అల్లు అరవింద్: ప్రమాదం జరిగిన వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, అల్లు అరవింద్, సందీప్ కిషన్ తదితరులు హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు రాత్రి 7.30 గంటల సమయంలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను సేఫ్‌గా ఉన్నాడు. వైద్యులతో మాట్లాడి ఈ విషయం చెబుతున్నాను. రేపు (శనివారం) సాధారణ రూమ్‌కు వచ్చి అందరితో మాట్లాడతాడని వైద్యులు చెప్పారు. మీడియాలో రకరకాల వార్తలు రాకూడదనే కారణంతో నేను కుటుంబం తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. తలకు గాయాలు, అంతర్గత బ్లీడింగ్ ఏదీ లేదని వైద్యులు చెప్పారు. తేజ్ చాలా చాలా సేఫ్‌గా ఉన్నాడు’’ అని తెలిపారు.
Also Read: సాయి ధరమ్ తేజ్ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు
సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియో ప్రకారం.. బైకు మీద వేగంగా వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా కిందపడ్డాడు. రోడ్డు మీద ఇసుక వల్లే బైకు జారినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వేగంగా ప్రయాణిస్తుండటంతో ఒక్కసారిగా విసిరేసిన్నట్లుగా బైకుతో సహా రోడ్డు మీద జారడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఆ సమయంలో అదే రోడ్డు మీద ఆటోలు, బైకులు కూడా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్‌కు చేర్చడం వల్ల తేజ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. అలాగే బైకు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ఉండటం వల్ల తలకు బలమైన గాయాలేవీ తగల్లేదు.
Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు