Nindu Manasulu Serial Today March 2nd: నిండు మనసులు: ప్రేరణ ఇంటి ముందు సిద్ధూ పడిగాపులు! తండ్రి కాలర్ పట్టుకున్న సిద్ధూ!
Nindu Manasulu Serial Today Episode March 2nd సిద్ధూ ప్రేరణ ఇంటి ముందే నిల్చొవడం మంజుల చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ సారి ఎలా అయినా నేను అనుకున్నది జరగాలి.. నీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటా.. రేపటికల్లా అంతా అయిపోవాలి అని మాట్లాడుతుంటాడు. సుధాకర్ చూసి వీడు మళ్లీ ఏదో ప్లాన్ చేశాడు అని అనుకుంటూ దగ్గరకు వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటాడు. నీకు ఏం పని లేదు వెళ్లిపో సుధా అని గణ అంటే మీ వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అర్థమైందని అని సుధాకర్ అంటాడు. నేను మీ నమ్మిన బంటుని సార్ నాకు చెప్పండి మీ ప్లాన్ అని సుధా అంటే.. నేను ఒకరికి ఒక మాటిచ్చా అది నెరవేరుతుంది.. వెయిట్ చేయ్ నీకే తెలుస్తుంది అంటాడు. ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు ఏంటా అని సుధా అనుకుంటాడు.
మరోవైపు సిద్ధూ ప్రేరణ ఇంటి నుంచి బయటకు వచ్చేసి బయట నిల్చొంటాడు. ప్రేరణ మేడ మీద నుంచి చూస్తుంది. ఇందిర సిద్ధూ దగ్గరకు వచ్చి ప్రేరణ అన్నమాటలకు బాధ పడ్డావా అంటే అవును ఆంటీ నేను తనకు అంతా చెప్పినా ఎందుకు నన్ను దూరం పెడుతుంది అని అంటుంది. తను పడే బాధ నువ్వు పడకూడదు అని నిన్ను దూరం పెట్టింది.. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటే.. నేను ప్రేరణకు ఏ కష్టం రానివ్వను అని మాటిచ్చాను.. ఎప్పటికీ ఆ మాట మీదే నిలబడి ఉంటా.. మీరు అవునన్నా కాదన్నా ఏ పరిస్థితిలో అయినా ఆ మాట మీదే అంటా.. తను మాట్లాడే వరకు ఇక్కడ నుంచి వెళ్లను నా ఆఖరి నిర్ణయం ఇదే అని అంటాడు. ఇందిర లోపలికి వెళ్లిపోతుంది. ప్రేరణ కూడా మేడ మీద నుంచి కిందకి వస్తుంది.
విజయానంద్, మంజులలు బయటకు వెళ్లాలి అనుకుంటారు. సిద్ధూని పిలిచారా అని మంజు అంటే సిద్ధూ మన ఫ్యామిలీనేనా.. ఎప్పుడూ ప్రేరణతోనే ఉంటున్నాడు.. కన్నతల్లి నిన్నే ఎదురించే స్థాయికి వచ్చేశాడు.. అన్నీ చూస్తుంటే సిద్ధూ మన వాడు కాదు.. ప్రేరణ మనిషి అనిపిస్తున్నాడు అంటాడు. నేను ఫోన్ చేస్తే సిద్ధూ వచ్చేస్తాడు అని మంజు కాల్ చేస్తుంది. తెలిసిన వాళ్ల ఇంట్లో ఫంక్షన్ ఉంది రా అని సిద్ధూని అంటే నేను రాలేను మళ్లీ కాల్ చేస్తా అని సిద్ధూ ఫోన్ పెట్టేస్తాడు. మన సిద్ధూ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో నేను చూపిస్తా నాతో రా అని విజయానంద్ మంజులని తీసుకెళ్తాడు. రాత్రి అయినా సిద్ధూ ప్రేరణ ఇంటి దగ్గరే ఉంటాడు. ప్రేరణ మేడ మీద చదువుతూ ఉంటే సిద్ధూ చూసి నువ్వు నాతో మాట్లాడే వరకు ఇక్కడి నుంచి వెళ్లను అని సైగ చేస్తాడు. ప్రేరణ లోపలికి వెళ్లిపోతుంది. విజయానంద్ మంజుతో కోట్లకి వారసుడైన మన సిద్ధూని తన ఇంటి ముందు ఎలా కాపాలా కాసేలా చేస్తుందో చూడు.. ఇలాగే వదిలేస్తే రేపు అమ్మ కావాలా... ప్రేరణ కావాలా అంటే ప్రేరణే కావాలి అంటాడు అని విజయానంద్ మంజులకి ఎక్కిస్తాడు. ఒకరి ఇంటి ముందు నిలబడాల్సిన అవసరం మన వాడికి పట్టలేదు అని మంజుల అంటుంది. ఇక మంజుల వెళ్లిపోదాం అని విజయానంద్‌ని తీసుకెళ్లిపోతుంది.
ప్రేరణ బయటకు రావడంతో నాతో మాట్లాడటానికి వస్తావని తెలుసు అని సిద్ధూ అంటే ప్రేరణ ఏం మాట్లాడకుండా ఓ లెటర్ ఇస్తుంది. దయచేసి ఇక్కడికి రావొద్దు.. నేను కేఫ్‌కి రాను.. నువ్వు నాతో కలిసి ఉన్నా మాట్లాడినా నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదు. అందుకే నా వల్ల నువ్వు నీ వల్ల నేను బాధ పడే పరిస్థితి రాకూడదు.. అందుకే ఇద్దరం అపరిచితుల్లా ఉండటం బెటర్ అంటుంది. దానికి సిద్ధూ పేపర్ మీద మళ్లీ నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ మనసులో మాట చెప్పావ్ అందుకు థ్యాంక్స్ అని రాసివెళ్లిపోతాడు.
ఇందిర దూరం నుంచి మొత్తం చూస్తుంది. సిద్ధూ ఇంటికి వెళ్లిన తర్వాత విజయానంద్ సిద్ధూతో ప్రేరణ ఇంటి దగ్గర పడిగాపులు అయిపోయావా అంటాడు. నన్ను ఫాలో చేస్తున్నావా అని అంటాడు. నేను ఏదో తప్పు చేసినట్లు నిఘా పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అమ్మ అని అంటాడు. నువ్వు అక్కడ ఉండటం నేను చూశా అని మంజు అంటుంది. ఈయన మాటలు నమ్మొద్దు చెడు ఆలోచనలు చేస్తూ మనుషుల్ని దూరం చేస్తాడు అని అంటుంది. ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మకి దూరంగా ఉండటం నా వల్లే అంటావా అని విజయ్ అంటే అవును మా అమ్మని నువ్వే మార్చుతున్నావ్ అని అంటాడు. మంజు సిద్ధూ మీద అరుస్తుంది. పరాయి వాళ్ల కోసం కన్నవాళ్లని ఎందుకు నిలదీస్తున్నావ్.. ఆ ప్రేరణ జోలికి ఎందుకు వెళ్తున్నావ్ అంటే ఎందుకు వెళ్లకూడదు అని సిద్ధూ అంటాడు. పెడ అర్థాలు తీసి ఈయన నీ మనసు మార్చుతున్నాడు అని సిద్ధూ అంటాడు. సిద్ధూకి మన కంటే ఎవరికి పుట్టిందో తెలీని ప్రేరణ ఎక్కువ అయిపోయింది అంటే ఏం కూశావ్ అని సిద్ధూ తండ్రి కాలర్ పట్టుకుంటాడు.
మంజుల భర్త కాలర్ విడిపించి తండ్రి అని గౌరవం లేకుండా కాలర్ పట్టుకుంటావా అంటే వీడు నా తండ్రి కాదు కాలేడు కూడా అంటాడు. కొడుకు మనసు తెలుసుకొని తన భవిష్యత్‌కి ఒక నమ్మకం ఇచ్చేవాడు తండ్రి అంటే.. కుట్రలు కుతంత్రాలు చేసే ఈ మనిషి నాకు తండ్రి ఎలా అవుతాడు. ఎప్పటికీ కాలేడు.. నాకు నువ్వు మాత్రమే తల్లివి అంతే.. నువ్వు ఈయన మాటలు నమ్మడం మానేయ్,, అప్పుడే నీకు ఎవరు ఎలాంటివాళ్లో తెలుస్తుంది.
ఇంకోసారి ప్రేరణ గురించి నోరు జారితే చేయి చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అని తండ్రికి వార్నింగ్ ఇచ్చి సిద్ధూ వెళ్లిపోతాడు. సిద్ధూని ప్రేరణ మార్చేసిందని విజయ్ అంటాడు. ప్రేరణ కుమార్‌కి కాల్ చేసి కేఫ్‌కి రాను అని చెప్పాలి అనుకుంటే కుమార్ హాస్పిటల్‌లో ఉంటాడు. ఏమైందని కుమార్ని అడుగుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉంది అన్న మాటలు విని కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























