అన్వేషించండి

Sai Dharam Tej: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన హాస్పిటల్‌‌కు తరలించారు. తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన తేజ్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిసింది. ప్రస్తుతం తేజ్‌ మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమాచారం తెలియగానే మెగా కుటుంబం ఆందోళనకు గురైంది. ముఖ్యంగా తేజ్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడనే విషయం తెలియగానే మరింత టెన్షన్ నెలకొంది. వెంటనే మెగా కుటుంబికులు తేజ్ పరిస్థితిని తెలుసుకొనేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే హాస్పిటల్‌కు వెళ్లి.. తేజ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స తర్వాత తేజ్ కోలుకున్నట్లు తెలిసింది. తేజ్ ప్రమాద వార్త తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. 

వినాయక చవితి సందర్భంగా సాయి థరమ్ తేజ్ తన అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ట్వీట్ చేసిన దాదాపు 9 గంటల్లోనే రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. అభిమానులకు కలవరపరుస్తోంది. సాయి ధరమ్ తేజా చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని.. తాను ప్రమాదానికి గురై ఇలా అపస్మారక స్థితికి చేరుకోవడం బాధకరమని అంటున్నారు. 

2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుప్రీం, విన్నర్ సినిమాల ద్వారా తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘రిపబ్లిక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం (సెప్టెంబరు 9న).. ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ ద్వారా కలెక్టర్లను గౌరవిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు. ఇండస్ట్రీలో కూడా తేజ్‌కు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget