అన్వేషించండి

Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

Allari Naresh Alcohol : అల్లరి నరేష్ లేటెస్ట్ కామెడీ డ్రామా ఆల్కహాల్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ కావాల్సిన సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది.

Allari Naresh's Alcohol Release Date Locked : అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'ఆల్కహాల్' (Alcohol). ఈ ఏడాది జనవరి 1న రిలీజ్ కావాల్సిన సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీని డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నారు. 'ఫ్యామిలీ డ్రామా' మూవీ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వం వహించగా... అల్లరి నరేష్ సరసన  రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం నటిస్తున్నారు.  గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్,  చైతన్య కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించగా... గిబ్రాన్ మ్యూజిక్ అందించారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. 

మరోసారి కామెడీ జానర్‌లో...

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన రోల్స్‌తో ఆకట్టుకునే అల్లరి నరేష్... మళ్లీ కామెడీ జానర్‌తో అలరించబోతున్నారు. 'ఆల్కహాల్' మూవీలో నరేష్ రిచ్చెస్ట్ పర్సన్‌గా కనిపించనున్నారు. ఆదాయం లక్షల్లో ఉన్నప్పటికీ ఆయనకు మద్యం తాగే అలవాటు ఉండదు. డ్రింకింగ్ తన మనసును కంట్రోల్ చేయడం తనకు ఇష్టం లేదని ఓ సందర్భంలో చెబుతారు. అయితే ఆయన ప్రవర్తన, చేసే పనులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.

మరోవైపు తన స్నేహితుల కోసం నరేష్ ఓ ఆల్కహాల్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పార్టీ వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉన్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తుంది. పార్టీలో పాల్గొన్న వారందరినీ చంపేస్తానని నరేష్ చెప్పడంతో సస్పెన్స్ నెలకొంటుంది. అసలు ఈ పార్టీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? గతంలో ఏదైనా సంఘటన జరిగిందా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 

Also Read : Baththa Movie OTT : ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Idupu Kayitham Teaser : ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Baththa Movie OTT : ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ReNew Power Investments: ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
CII Partnership Summit 2026 Live Updates: ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Embed widget