Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి పది నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
TTD: తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేక సందర్భాల్లో కల్పించే వైకుఠ ద్వార దర్శన భాగ్యాన్ని జనవరరి పది నుంచి కల్పించబోతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ దర్శనాలను జనవరి 19 వరకు ఉంటుందని పేర్కొంది. దీనికి టోకెన్లను జనవరి 9 ఉదయం ఐదు గంటల నుంచి జారీ చేయనున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని మొదటి మూడు రోజుల టోకెన్లను అదే రోజు ఇస్తారు. దాదాపు లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. మిగిలిన రోజులు దర్శనం చేసుకోవాలనుకునే వాళ్లు ముందు రోజు టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
వైకుఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ సిద్దం చేసింది. భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మున్సిపల్ గ్రౌండ్స్, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, ఎంఆర్ పల్లి పాఠశాల, శ్రీనివాసంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఇవి కాకుంకడా బాలాజీ నగర్‌లోని హాలులో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు రెడీ చేస్తున్నారు. అన్నీ కలిపి మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.
వైకుంఠ ద్వార దర్శన కాలంలో అంటే పది రోజుల పాటు టోకెన్లులేని భక్తులను దర్శనానికి అనుమతి లేదని ఈవో స్పష్టం చేశారు. గోవింద మాల ధరించిన భక్తులు కూడా టోకెన్లు పొందాలని సూచించారు. వాళ్లకు ప్రత్యేకంగా ఎలాంటి టికెట్లు లేవని ఈవో తేల్చి చెప్పారు. ఈ దఫా భక్తులకు టోకెన్లతోపాటు ప్రత్యేక స్లిప్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో వారి ఫొటో ఉంటుందన్నారు. అక్రమాల నివారణకు ఇలాంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
టోకెన్ల జారీ నుంచి దర్శనం చేసుకునే వరకు ఎంత పెద్ద క్యూలైన్లు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు ఈవో. రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. బారికేడ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. దారి పొడవునా తాగునీరు, మరుగుదొడ్లు సహా ఇతర సౌకర్యాలు కల్పించామని వివరించారు.
మంగళవారం సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిరుమలేశుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు ఏర్పాటు, ఆస్తుల, ఆలయాల విస్తరణకు ప్రత్యేక కమిటీ ఫామ్ చేయనుంది. ఫీడ్ బ్యాక్ కోసం ప్రత్యేక వ్యవస్థ తీసుకురానుంది. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. వారి అభిప్రాయం ఏంటీ ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయను అడిగి తెలుసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ సాయంతో ఫీడ్‌బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం పని చేయనుంది.
తిరుమలలో దొరికే ఫుడ్‌పై కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన టీటీడీబోర్డు ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రత్యేక అధికారి ఇతర సిబ్బందిని కూడా నియమించనుంది. తిరుమలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, అన్న ప్రసాద విభాగంలో 258 మంది సిబ్బందిని SLSMPC ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో నియమించబోతున్నారు.