Ram Charan: చెర్రీ కొత్త బిజినెస్.. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ అవుతారా?
రామ్ చరణ్ కొత్త స్టెప్ వేయబోతున్నారా ? సినిమాలో వేసే స్టెప్ కాదు , రియల్ లైఫ్‌లో.. సినిమాల్లో సూపర్ బిజీగా ఉండి, బిజినెస్ లోనూ ఎదుగుతున్న రామ్ చరణ్ కొత్తగా మరో బిజినెస్ మొదలు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్‌తో పాటు గత నాలుగైదేళ్లుగా ప్రొడక్షన్‌లో ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్ పేరుతో చెర్రీ సినిమాలు తీస్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చినవే, మరో అప్ కమింగ్ మూవీ ఆచార్య.
వీటితో పాటు ఎయిర్ లైన్స్‌లో ట్రూ జెట్ సర్వీస్‌లో భాగస్వామిగా ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న జాయింట్ వెంచర్ ఇది. ఆ తర్వాత స్పోర్ట్స్ మీద వున్న ఆసక్తితో ఓ పోలో టీంను కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, వీటన్నిటితో పాటు మీడియా రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ త్వరలో ఓ ఛానల్‌ను టేక్ ఓవర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ నిర్మాత ఆ ఛానల్ లో ఆల్రెడీ పెట్టుబడులు పెడుతున్నారని, త్వరలో చెర్రీ రంగం లోకి దిగుతారని అనుకుంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సి వుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.