Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్‌పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై 'మా' అధ్యక్షుడు నరేష్ స్పందించిన సంగతి తెలిసిందే.
హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై 'మా' అధ్యక్షుడు నరేష్ స్పందించిన సంగతి తెలిసిందే. రేస్ లకు వెళ్తారని.. కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నానని తన అభిప్రాయం చెప్పారు. అయితే నరేష్ స్పందనను తప్పుబట్టారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, నటుడు శ్రీకాంత్.
Also Read : Sai Dharam Tej Medical Bulletin: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?
ముందుగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''సాయి ధరమ్ తేజ్ గారు షూటింగ్స్ చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు.. అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్‌లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తూ మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరలా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సార్. రేసింగ్ చేశాడు.. అది చేశాడు, ఇది చేశాడు.. మీ ఇంటి దగ్గరకు వచ్చాడు.. ఎందుకు ఇవన్నీ చెప్పండి. తప్పు కదా సార్. ఇలాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి.. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అందరూ.. దయచేసి మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్, భగవంతుడి ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.. థ్యాంక్యూ'' అంటూ రియాక్ట్ అయ్యారు.
It’s True .please don’t do politics In this time it’s not correct it’s my humble request🙏 pic.twitter.com/ckFXWwKEE7
— BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021
నటుడు శ్రీకాంత్ కూడా ఈ విషయంలో నరేష్ ని తప్పుబట్టారు. ''సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్. కామన్ గా జరిగేవే. రోడ్డు మీద ఇసుక ఉండడంతో స్కిడ్ అయి పడిపోయారు. ఆయన త్వరగా కోలుకుంటారు. కోలుకోవాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దయచేసి ఎవరైనా వీడియో బైట్లు పెట్టేప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు తెలిసిన యంగ్ స్టర్స్ లో తను చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంటాడు. తను ర్యాష్ గా వెళ్లే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైమ్ లో.. కుటుంబసభ్యులంతా టెన్షన్ లో ఉన్నారు. అలాంటి టెన్షన్ లో మనం పెట్టే బైట్లు ఆ కుటుంబాన్ని ఇంకా టెన్షన్ పెడతాయి. నరేష్ గారు పెట్టిన బైట్.. అది కూడా ఈ టైమ్ లో.. చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. దయచేసి అలాంటి బైట్లు ఎవరూ పెట్టకూడదని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.
Srikanth about @IamSaiDharamTej #SaiDharamTej #GetWellSoonSaiTej #SaiDharamTejaccident pic.twitter.com/0EQIqsEQWl
— suresh kavirayani (@sureshkavirayan) September 11, 2021
Also Read: కెమెరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?
Also Read: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు