Sai Dharam Tej Accident : నెగ్లిజెన్స్ కాదు.. కేవలం యాక్సిడెంట్ మాత్రమే.. వీడియో రిలీజ్ చేసిన నరేష్..
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి శనివారం ఉదయం 'మా' అధ్యక్షుడు నరేష్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి శనివారం ఉదయం 'మా' అధ్యక్షుడు నరేష్ కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బైక్ రైడింగ్ వద్దని తాను చాలాసార్లు సాయిని హెచ్చరించినట్టు అన్నారు నరేష్. బైక్ రైడింగ్ విషయంలో నాలుగు రోజుల క్రితం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నానని వెల్లడించారు. నరేష్ మాట్లాడిన తీరుపై కొందరు సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో తాజాగా మరో వీడియో మెసేజ్ ను విడుదల చేశారు నరేష్.
Also Read : Sai Dharam Tej Accident: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
''నేను పొద్దున్నే సాయి ధరమ్ తేజ్ గురించి ప్రార్ధించాను.. అతడు చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాడు. త్వరలోనే నార్మల్ అవుతాడు. నేను క్లియర్ గా చెప్పాను.. ఇద్దరూ(నవీన్ విజయ్ కృష్ణ, సాయి ధరమ్ తేజ్) కలిసి వెళ్లిన మాట వాస్తవమే.. ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ తరువాత ఎవరరికి వాళ్లు వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సెపరేట్ గా ఉన్నారు. వీళ్లెవరూ రేసుల్లో లేరు. మీడియాలో వస్తోన్న క్లిపింగ్స్ లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్ 60, 70 లో వస్తున్నాడు.. ర్యాష్ గా లేడని చెప్పాను. రోడ్డు మీదున్న మున్సిపల్ మట్టిలో జారి ఈ ప్రమాదం జరిగింది. ఇది నెగ్లిజెన్స్ కాదు.. కేవలం యాక్సిడెంట్ మాత్రమే. ఇలాంటివి జరుగుతుంటాయి. బిడ్డలు బాగుండాలనే కోరుకుంటాం. ఇప్పుడు సేఫ్ గా సాయి ధరమ్ తేజ్ బయటకొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన కోసం ప్రేయర్స్ చేస్తాను'' అంటూ చెప్పుకొచ్చారు.
Thank you sir 🙏 pic.twitter.com/ApmCUwu0rS
— BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021
Also Read : Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
Also Read : Sai Dharam Tej Medical Bulletin: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?
Also read: సాయి ధరమ్ తేజ్ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్
Also read: 'ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్' సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మీ కామెంట్స్!