Sai Dharam Tej Accident: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై సీనియర్ నటుడు నరేష్ మాట్లాడారు.
సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 24 గంటల పాటూ అబ్జర్వేషన్లో ఉంచినట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అపోలోకు వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వైద్యులు చెప్పినదానికి ప్రకారం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఈ విషయంపై మాట్లాడారు. సాయి తన బిడ్డలాంటివాడేనని అన్నారు. తన కొడుకు నవీన్, సాయి ఇద్దరూ మంచి స్నేహితులని, నిన్న సాయంత్రం తమ ఇంటి నుంచే బయలుదేరారని, బైక్ సౌండ్స్ విని వెళ్లేలోపే వారిద్దరూ బయల్దేరిపోయారని చెప్పారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలాసార్లు సాయిని హెచ్చరించినట్టు అన్నారు నరేష్. అతను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. బైక్ రైడింగ్ విషయంలో నాలుగు రోజుల క్రితం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నానని వెల్లడించారు. పెళ్లిచేసుకోవాల్సిన వాళ్లు, మంచి కెరీర్ ఉన్నవాళ్లు ఇలా జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోవడం మంచిదికాదని హితవు పలికారు. సాయిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లాలనుకున్నానని, కానీ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్లి ఇబ్బందిపెట్టడమెందుకని ఊరుకున్నానని తెలిపారు.
కాగా నరేష్ మాట్లాడిన తరువాత పోలీసులు నవీన్, సాయి కలిసి బైక్ రేసింగ్ పాల్గొన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విషయంలో నరేష్ కొడుకు నవీన్ ను కూడా విచారిస్తామని చెప్పారు. తీగల వంతెనపై రేసింగ్ కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బైక్ రేసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కోలుకున్న తరువాత ఆయన్ను ఈ విషయంలో విచారించే అవకాశాలు ఉన్నాయి. విచారణలో బైక్ రేసింగ్ కు పాల్పడినట్టు తేలితే మాత్రం సాయిధరమ్ తేజ్ చిక్కుల్లో పడతారు. ఇప్పటికే అతనిపై ఫాస్ట్ గా డ్రైవ్ చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. నరేస్ కుమారుడు నవీన్, సాయిధరమ్ తేజ్ తో పాటూ మూడో వ్యక్తి కూడా రేసింగ్ లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే పోలీసులు వివరాలు బయటపెట్టే అవకాశం ఉంది.
Also read: సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన పవన్ కళ్యాణ్ సలహా.. ఆ వీడియో వైరల్
Also read: 'ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్' సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మీ కామెంట్స్!