News
News
X

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌పై వెంటనే కేసు పెట్టిన పోలీసులు..వాళ్లనెందుకు వదిలేశారు.. ఆర్పీ పట్నాయక్‌ పోస్ట్‌ వైరల్

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో అత్యంత వేగంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.ఈ రెండింటికీ సంబంధం ఏంటంటారా!

FOLLOW US: 
 
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజ్ త్వరగా కోలుకుని రావాలని సెలబ్రెటీలు, అభిమానులు కోరుకుంటున్నారు. స్పందించిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇదే సమయంలో పోలీసులపై ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘యాక్సిడెంట్‌ విషయంలో అతివేగంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చర్యల వల్ల నగరంలో మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Alos Read:తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు

ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని మాదాపూర్‌ ఏసీపీ ఇప్పటికే చెప్పారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని వాహనాన్ని అదుపుచేయలేకపోయారని స్పష్టం చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళనం చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

News Reels

Also read:తెలుగు సినిమా హీరోలకు బైకులంటే ఎందుకంత మోజు..

108 సిబ్బంది ద్వారా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఆర్పీ పట్నాయక్ కామెంట్స్ పై పోలీసులు ఎలా రియాక్టవుతారో చూడాలి. నెటిజన్లు మాత్రం ఆర్పీ మాట్లిడింది కరక్టే కదా అంటున్నారు

Also Read: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ

Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..

Also Read: జైల్లోకి జెస్సీ, నా కొడుకు మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు సపోర్ట్ చేయండంటూ జస్వంత్ పడాల తల్లి భావోద్వేగం

Published at : 11 Sep 2021 12:58 PM (IST) Tags: Sai Dharam Tej Health Updates Music Director Rp Patnayak Post Viral On Sai Dharam Tej

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham December 9th: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక

Ennenno Janmalabandham December 9th: ఊహించని ట్విస్ట్, సులోచన యాక్సిడెంట్ కేసులో కొడుకుని అరెస్ట్ చేయించిన యష్- కక్ష కట్టిన మాళవిక

Gruhalakshmi December 9th: తులసి మాట విని భార్యకి సోరి చెప్పిన నందు- కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి లాస్య స్కెచ్

Gruhalakshmi December 9th: తులసి మాట విని భార్యకి సోరి చెప్పిన నందు- కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి లాస్య స్కెచ్

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

టాప్ స్టోరీస్

most trending news in telangana 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

most trending news in telangana 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

శశికళ మృతికి ఎవరి కారణం ? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

శశికళ మృతికి ఎవరి కారణం ? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Mandous Cyclone Effect: మాండూస్ తుపాను ఎఫెక్ట్ - ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Mandous Cyclone Effect: మాండూస్ తుపాను ఎఫెక్ట్ - ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు