Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
![Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ Sai Dharam Tej: Hyderabad Police Case Registered Against Mega Hero Sai Dharam Tej Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/11/e5520020f5c81e71bf943dd726ad9d73_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 108 సిబ్బంది ద్వారా ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోందన్నారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసు ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..
ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని వాహనాన్ని అదుపుచేయలేకపోయారని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్ బోన్ విరిగిందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని చెప్పారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read:వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు
Also Read: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపస్మారక స్థితిలోకి హీరో, ఆస్పత్రికి చిరు, పవన్
Also read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు
Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)