News
News
X

Sai Dharam TeJ: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..

బైక్ యాక్సిడెంట్ కి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రమాదానికి గురైన బైక్ ని తేజ్ లాంచ్ చేసిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది..

FOLLOW US: 
 
బైక్ పై మక్కువ చూపించని యూత్ ఉండరేమో. ఇక హై పర్ఫార్మెన్స్ బైక్ లు అంటే మరింత ఇష్టం. అలాంటి బైక్స్ లో ఒకటి సాయి ధరమ్ తేజ్ వాడుతున్న ట్రయంఫ్ ట్రైడెంట్ 660. ఈ బైక్ గురించి ఇప్పుడెందుకు చర్చ అంటే మెగా హీరో యాక్సిడెంట్ కి గురైంది ఈ బైక్ పైనే. కేవలం అదొక్కటే కాదు..ఈ బైక్ ను లాంచ్ చేసింది కూడా సుప్రీం హీరోనే. బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఆల్-న్యూ ట్రైడెంట్ 660 ధర భారతదేశంలో రూ .6.95 లక్షలు. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ 660 సిసి, ఇన్లైన్ ట్రిపుల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. టూ రైడ్ మోడ్స్ రోడ్ అండ్ రెయిన్ స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, థొరెటల్-బై-వైర్ వంటి రెండు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ తో పాటూ ట్రయండ్ మోటార్ సైకిల్స్ ట్రైడెంట్‌తో కొన్ని ఆప్షనల్ యాక్ససరీస్ కూడా అందిస్తున్నాయి. ఈ బైక్ ని ఈ ఏడాది ఏప్రిల్ రెండోవారం  అంటే సరిగ్గా ఐదు నెలల క్రితం సాయిధరమ్ తేజ్ హైదారాబాద్ లో లాంచ్ చేశాడు.

Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ని లాంచ్ చేసినప్పుడే మనసుపారేసుకున్న తేజ్ అప్పటి నుంచీ దీన్నే వాడుతున్నాడు. ఈ బైక్ పై వెళుతుండగానే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఆసుపత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు మెగా అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన మాదాపూర్ పోలీసులు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Also Read:వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు

News Reels

Also Read: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపస్మారక స్థితిలోకి హీరో, ఆస్పత్రికి చిరు, పవన్

Also Read: హెల్మెటే కాపాడింది.. సాయి ధరమ్‌ తేజ్‌కు తప్పిన ప్రాణాపాయం? ఇదీ మెడికల్ అప్‌డేట్

Also read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు

Published at : 11 Sep 2021 06:36 AM (IST) Tags: chiranjeevi pawan kalyan Hyderabad Accident Sai Dharam Tej Mega family Mega Hero Sai Dharam Tej He Launched Bike Triumph Trident 660 Bike

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Gruhalakshmi December 3rd: లాస్యని ఫుట్ బాల్ ఆడుకున్న తోడికోడళ్ళు- బస్సెక్కడానికి సామ్రాట్ తిప్పలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?