Pakistani Taliban: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
Asim Munir: పాక్ తాలిబాన్ లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. మగాడివైతే మా ముందు నిలబడి పోరాడాలని చాలెంజ్ చేశారు.

Pakistani Taliban Threatens Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్‌కు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. టీటీపీ విడుదల చేసిన వీడియోల శ్రేణిలో ఒక సీనియర్ కమాండర్ మునీర్‌ను సవాలు చేస్తూ, "మగాడివైతే మా ముందు నిలబడు, మీ తల్లి పాలు తాగి ఉంటే మాతో పోరాడు" అని హెచ్చరించాడు.
టీటీపీ విడుదల చేసిన వీడియోలు పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌ను ఇరకాటంలో పడేశాయి. ఈ వీడియోలలో టీటీపీ సీనియర్ కమాండర్ కాజిం పాక్ సైనికులను పంపకుండా, ఉన్నతాధికారులు స్వయంగా యుద్ధరంగంలోకి రావాలని సవాలు విసిరాడు. అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా జిల్లాలోని కుర్రం ప్రాంతంలో జరిగిన ఆకస్మిక దాడి ఫుటేజీని చూపించారు. టీటీపీ 22 మంది పాక్ సైనికులను చంపినట్లు, ఆయుధాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పాక్ తాలిబన్లు ప్రకటించారు. పాక్ అధికారిక నివేదికలు 11 మంది మాత్రమే మరణించినట్లు చెప్పాయి.
'Agar mard hai...' (If you're man enough)
— Shreya Upadhyaya (@ShreyaOpines) October 23, 2025
TTP sends a message to #Pakistan Army Chief Asim Munir - asks him to come and fight himself, instead of sending soldiers to die #AfghanistanAndPakistan #Afghanistan #PakistanArmy pic.twitter.com/om13JA3oLK
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఆర్టిలరీ దాడులు, ఎయిర్ స్ట్రైక్‌లు జరిగిన తర్వాత, అక్టోబర్ మధ్యలో రెండు దేశాలు కాల్పుల విరమణ పాటించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో దోహాలో ఈ ఒప్పందం జరిగింది. అయితే, ఆఫ్ఘన్ నుంచి ఉగ్రవాద మూకలపై చర్యలు తీసుకోకపోతే ఈ శాంతి ఒప్పందం కొనసాగదని పాక్ పట్టుబట్టింది. టీటీపీని ఆప్ఘన్ భూభాగంలో ఉండనీయకూడదని పాక్ షరతు పెడుతోంది.
Peshawar – deep inside Pakistan’s own territory . 📍
— Najib Farhodi (@Najib_Farhodi) October 23, 2025
Where #TTP fighters now set up checkpoints on public roads.
These scenes show that #Pakistan’s military regime no longer has full control over its own cities.
A regime that claims to possess nuclear weapons, yet fails to… pic.twitter.com/ms1r12WTtY
టీటీపీ ఇటీవలి కాలంలో పాక్ సైనికులపై దాడులు చేస్తోంది. లష్కర్-ఇ-జంగ్వీ (ఎల్‌ఈజే), ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ), జైష్-ఇ-మహమ్మద్ స్ప్లింటర్ గ్రూపులు ఇందులో ఉన్నాయి. ఎల్‌ఈజే మైనార్టీ కమ్యూనిటీలపై సెక్టేరియన్ టెర్రర్ దాడులకు ప్రసిద్ధి. ఐఎస్‌కేపీ టీటీపీ నుంచి అసంతృప్త ఫైటర్లను రిక్రూట్ చేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా (కేపీకే) ప్రాంతంలో పాక్ ఆర్మీకి కౌంటర్ స్ట్రాటజీ లేదని, గవర్నెన్స్ ప్లాన్ లేదని విమర్శలు వస్తున్నాయి. అక్టోబర్ 21న పాక్ అధికారులు టీటీపీ కమాండర్ కాజిం గురించి సమాచారం ఇచ్చినవారికి 10 కోట్ల పాక్ రూపాయల రివార్డు ప్రకటించారు. టీటీపీ దాడులు పెరగడంతో పాక్ సైన్యం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.





















