News
News
X

Bigg Boss Telugu Season5: జైల్లోకి జెస్సీ, నా కొడుకు మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు సపోర్ట్ చేయండంటూ జస్వంత్ పడాల తల్లి భావోద్వేగం

బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకున్న జెస్సీని జైల్లో ఉంచి తాళం వేయమన్నారు బిగ్ బాస్. అయితే హౌస్ లో జరుగుతున్నదంతా చూసి తన కొడుకు అమాయకుడంటూ జెస్సీ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 తొలివారం నామినేషన్స్‌లో యాంకర్ రవి, కాజల్, మానస్, హమీదా, సరయుతో పాటు జెస్సీ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. సాధారణంగా నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులంతా చాలా టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి సమయంలో వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేసి జైలుకి పంపించడం జెస్సీకి పెద్ద షాకే. ఈ వారం రోజులుగా హౌస్ లో పరిస్థితులు చూసిన జెస్సీ తల్లి భావోద్వేగానికి గురైంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న తన ఆశకి బిగ్ బాస్ హౌస్ ఊపిరి పోస్తుందనే ఆశతో అడుగుపెట్టాడని..కానీ తను చాలా అమాయకుడుని అంటోందామె. తొలివారం నామినేషన్లలో ఉండడం, ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో మెంటల్ గా డిస్ట్రబ్ అవుతున్నాడని భావోద్వేగానికి లోనైంది.

Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..

జీవితంలో ఇప్పటి వరకూ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కెరీర్ మొదలయ్యే సమయంలో తండ్రి చనిపోవడంతో ఫోకస్ చేయలేకపోయాడు..ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ద్వారా దేవుడు మరో ఛాన్సిచ్చాడనే ఆశతో ఉన్న జెస్సీని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలంది. ఇన్నాళ్లూ ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన జెస్సీకి మీ అందరి సపోర్ట్ కావాలని తను టాప్ 5లో ఉండాలని ఆశపడుతున్నా అందామె. హౌస్ మేట్స్ అంతా ఏకాభిప్రాయంతో విశ్వను బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేయగా..జెస్సీని వరస్ట్ ఫెర్ఫామర్ గా ఎంపిక చేశాక..బిగ్ బాస్ ఆదేశాలమేరకు జైల్లో పెట్టారు.

Also Read: నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం... హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు

హౌస్ లో బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్..

రవి - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. లోబో - యానీని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.  

జెస్సీ - సిరిని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. రవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.  

శ్వేతా - విశ్వని బెస్ట్ పెర్ఫార్మన్స్ గా.. ఉమాదేవిని వరస్ట్ గా పెర్ఫార్మన్స్ గా ఎన్నుకున్నారు.  ఉమాదేవి - విశ్వని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.

సిరి - నటరాజ్ ని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. ఉమాదేవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.  

విశ్వ - ప్రియాంకని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.  

లహరి - విశ్వని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.

ప్రియాంక - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకోగా.. ఉమాదేవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.

యానీ - బెస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియాంకను ఎన్నుకోగా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.

సరయు - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. 

Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?

Also read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు

Also Read: ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించాలి..కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఏపనీ చేయొద్దు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Published at : 11 Sep 2021 08:02 AM (IST) Tags: Contestants jaswanth Mother Gets Emotional Bigg Boss Telugu Season5

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్

Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్

Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి

Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్

టాప్ స్టోరీస్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!

IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!