News
News
X

Sai Dharam Tej Health Bulletin: నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం... తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో వైద్యులు

హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

FOLLOW US: 
 
హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదం గాయపడిన సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ఈ బులిటెన్‌లో సాయిధరమ్ తేజ్‌ శరీరంలో అంతర్భాగంగా ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. కాలర్ బోన్ విరిగిందని పేర్కొన్నారు.  ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు.   

Also Read: కెమేరాకు చిక్కిన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఇసుక వల్లే ప్రమాదమా? అతివేగమా?

News Reels

ఆందోళన చెందవద్దు

సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై నటుడు చిరంజీవి స్పందించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 

Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు

బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం

శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తూ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెల్మెట్‌ ధరించి ఉన్నప్పటికీ గాయాలు బలంగా తగిలాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు ఆయన్ని సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

Also Read: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్‌ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు

ప్రమాదంపై మంత్రి తలసాని ఆరా

ప్రమాదంపై సమాచారం నటుడు చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, సందీప్‌ కిషన్‌ ఆస్పత్రికి చేరుకుని సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. ఆయన అపోలో వైద్యులతో మాట్లాడారు. గణేషుని దయతో ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. 

Also Read: Sai Dharam Tej Health Update: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు

Published at : 11 Sep 2021 06:44 AM (IST) Tags: chiranjeevi Hyderabad apollo hospital Sai Dharam Tej hyderabad road accident hero sai dharam tej

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 2nd Update:  అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Guppedantha Manasu December 2nd Update: అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

Gruhalakshmi December 2nd: నందుని అవమానించిన లాస్య, తండ్రికి సపోర్ట్ గా నిలిచిన ప్రేమ్, అభి- గృహిణిగా తిప్పలు పడుతున్న సామ్రాట్

Gruhalakshmi December 2nd: నందుని అవమానించిన లాస్య, తండ్రికి సపోర్ట్ గా నిలిచిన ప్రేమ్, అభి- గృహిణిగా తిప్పలు పడుతున్న సామ్రాట్

Ennenno Janmalabandham December 2nd: నిజం తెలిసి ఆదిత్యని జైలుకి పంపించేందుకు ప్లాన్ వేసిన అభిమన్యు- ఖుషి మీద అరిచిన యష్

Ennenno Janmalabandham December 2nd: నిజం తెలిసి ఆదిత్యని జైలుకి పంపించేందుకు ప్లాన్ వేసిన అభిమన్యు- ఖుషి మీద అరిచిన యష్

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?