Horoscope Today : ఈ రాశుల వారు ఖర్చులు నియంత్రించాలి..కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఏపనీ చేయొద్దు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 సెప్టెంబరు 11శనివారం రాశిఫలాలు
మేషం
మీరు ఈరోజు ఒత్తిడిని అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో అసమ్మతి ఉండొచ్చు. అడ్డంకులు-సవాళ్లు అధిగమించేందుకు తగినంత సామర్థ్యం ఉంది. పని ప్రదేశంలో శుభవార్తలు పొందవచ్చు.
వృషభం
ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. పని విషయంలో అశ్రద్ధ చేయవద్దు....మీ ఆర్థిక స్థితిపై ఈ ప్రభావం ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. అనారోగ్య సూచనలున్నాయి. కొత్త ఆర్థిక ప్రణాళికల గురించి తెలుసుకుంటారు. అవగాహన ఉన్న వ్యక్తులను సంప్రదించిన తర్వాతే పెట్టుబడి పెట్టండి. రుణం మొత్తాన్ని తిరిగి పొందుతారు.
మిథునం
మీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో బిజీగా ఉంటారు. భాగస్వామితో సామరస్యంగా ఉండండి. సంబంధాలు బలపడతాయి. ఈ రోజు ప్రయాణానికి మంచి రోజు కాదు. మీ సన్నిహితుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సమయానికి బాధ్యతలు నిర్వర్తించగలరు. వాహనం జాగ్రత్తగా నడపండి.
Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
కర్కాటక రాశి
ఈరోజు లాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఉద్యోగులు పురోగతి సాధించగలరు. చాలా సంతోషంగా ఉంటారు.
సింహం
మీ కోపాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించండి. కొత్త వ్యక్తులను కలుస్తారు, కొత్తగా చేపట్టిన పనిపట్ల ఉత్సాహంగా ఉంటారు. జాగ్రత్తగా ఖర్చు చేయండి. మీ రహస్యాలు అందరకీ చెప్పొద్దు. ఫిక్స్ చేసుకున్న బడ్జెట్ దాటి ఖర్చు చేయవద్దు. ఉదారంగా వ్యవహరించి నష్టపోవద్దు.
కన్య
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. మీకు ఉపయోగపడే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపడతారు.
Also Read:కామవాంఛతో పురుషులు…ధర్మం విడిచిన స్త్రీలు… కలియుగంలో మనుషుల ప్రవర్తనపై శివపురాణం ఏం చెప్పిందంటే…
తులారాశి
మీ నిజాయితీతో కొందరు బాధపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అత్తవారింటి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు అవకాశం ఉంది.
వృశ్చికరాశి
వ్యాపారస్తులకు మంచి సమయం ఇంది. పూర్వీకుల ఆస్తి వ్యవహారాల కొనసాగుతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి.
ధనుస్సు
మీకు కలిసొచ్చే రోజుది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వాదన జరగొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి.
Also Read:ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?
మకరం
ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయవచ్చు.
కుంభం
వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబ సభ్యుల సలహా లేకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. విద్య గురించి కొత్త సమాచారాన్ని పొందుతారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. అద్దె ఇంటి నుంచి మరో ఇంటికైనా, సొంతింటికైనా మారే సూచనలున్నాయి.
మీనం
అదృష్టం కలిసొస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన ఓ పని పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు మార్చుకోండి.