Sai Dharam Tej Accident : 'ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్' సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మంచు లక్ష్మీ కామెంట్స్!
ప్రముఖ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రముఖ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ.. తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురి అవ్వడంపై రకరకాల రూమర్స్ వినిపించాయి. అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు.. తాగేసి బండి డ్రైవ్ చేశాడని మరికొందరు కామెంట్స్ చేశారు.
Also Read : తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మాత్రం అంతటి వేగంతో బండి నడుపుతున్నట్లుగా లేదు. అయితే ఈ ప్రమాదం, జరిగిన తీరుపై వస్తోన్న రూమర్లను మంచు లక్ష్మీ తనదైన స్టైల్ లో కొట్టిపారేసింది. ఇప్పటికే తేజ్ ని చూడడానికి హాస్పిటల్ వద్దకు చేరుకున్న మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లను ఖండిస్తూ పోస్ట్ లు పెట్టింది.
బాధ్యతాయుతమైన పౌరుడిగా తేజ్ గురించి తనకు తెలుసని.. ఎక్కడా కూడా అతడు మితిమీరిన వేగంతో వెళ్లినట్లు కనిపించడం లేదని.. ఆ రోడ్డు మీదున్న మట్టి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. అంతేకాదు.. తేజ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడని.. ఇది మనమంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో.. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధించండి అంటూ పోస్ట్ పెట్టింది.
Tej is one of the most responsible citizens that I know. It is very clear that he wasn’t speeding at any given moment. There was mud on the road that led to the accident. I request all of you to stop spreading rumours.
— Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021
Currently he is responding well.
— Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021
It is a time for celebration as this could have been fatal for him. please keep him in your prayers & pray for his speedy recovery 🙏🏼
Also Read: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ
Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..