Tollywood Drug Case: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?

నవదీప్‌కు చెందిన ఎఫ్-క్లబ్ వల్లే టాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారా? ఆ క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ దందా నడించిందా? అసలు ఏం జరిగింది?

FOLLOW US: 

తెలుగు ప్రజలకు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమాల్లోని నటీనటులను ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. వారిని తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. తారలంటే వారి దృష్టిలో తెరపై మెరిసే మాణిక్యాలు. కానీ, వారిలో కొందరు మత్తులో జోగే మాణిక్యాలంటే ఎవ్వరూ నమ్మలేరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే పరిస్థితి ఉంది. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఎంతోమంది అభిమానం చూరగొన్న పూరీ జగన్నాథ్ ఇలా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారంటే ఎవ్వరూ నమ్మలేరు. బ్యాంకాక్ ఇసుక తిన్నెల్లో చక్కని కథలు రాసుకొనే పూరీ.. నిర్దోషిగా బయటపడి మళ్లీ అలరించాలనే కోరుకుంటారు. ఆయనే కాదు ఈ కేసులో చిక్కున్న తారలంతా బయటపడితే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. టాలీవుడ్‌పై పడిన మచ్చ తొలగిపోయిందని సంతోషిస్తారు. ఎక్సైజ్ అధికారుల విచారణలో మన తారాలకు క్లీన్ చీట్ లభించిందనే సంతోషం ఎన్ని రోజులో నిలవలేదు. పాపం వెంటాడుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈడీ ఈ కేసును మరింత లోతుగా విచారించడం మొదలుపెట్టింది. ఈడీకి అప్రూవర్‌గా మారిపోయిన కాల్విన్ మస్కరేన్హాస్ ఇచ్చిన వివరాలతో ఆయా తారల బ్యాంకు లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. 

ఆ పార్టీ.. కొంపముంచిందా?: 2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్ పార్టనర్‌గా ప్రారంభించిన ‘ఎఫ్-క్లబ్’ చూట్టూ ఈ డర్టీ పిక్చర్ కథ నడుస్తోంది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అతడి వద్ద కొందరు డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఆ క్లబ్ ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానం. ఈ నేపథ్యంలో అధికారులు క్లబ్‌ను సీల్ చేశారు. విచారణలో భాగంగా ఎఫ్ క్లబ్‌లోని సీసీటీవీ కెమేరా వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. 

వీరిలో పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ తదితరులు ఉన్నారు. విచారణలో భాగంగా అధికారులు వారి గోళ్లు, రక్తం, వెంట్రుకలు తదితర శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ కేసు విచారణ సుమారు రెండేళ్లు సాగింది. అయితే, ఈ విచారణకు హజరైన సినీ ప్రముఖుల పేర్లు చార్జిషీట్‌లో నమోదు చేయలేదు. పైగా ఈ డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న 62 మంది బాధితులని పేర్కొనడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద మరోసారి డ్రగ్స్ కేసును విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ 12 మందికి నోటీసులు పంపింది. అయితే అప్పట్లో సిట్ విచారణలో లేని రకుల్ ప్రీత్, రాణాలను ఈసారి ఈడీ విచారిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది.  
  
కెల్విన్ ఏం చెప్పాడు?: కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో ఈడీ పని సులభమైంది. గతంలో ఎక్సైజ్ శాఖ కూడా కెల్విన్‌ను విచారించింది. కానీ, అప్పట్లో ఏ వివరాలు కెల్విన్ చెప్పలేదు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ ఆరు నెలల కిందట కెల్విన్ మీద కేసు నమోదు చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈడీ అతడిని 12 సార్లు ప్రశ్నించారు. అతడి అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో అప్రూవర్‌గా మారాడు. ఈ సందర్భంగా ఈడీకి పలు కీలక వివరాలను అందించాడు. వాటి ఆధారంగానే ఈడీ తాజాగా 12 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలులో భాగంగా విదేశాలకు భారీగా నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల అకౌంట్లను ఈడీ పరిశీలిస్తోంది. 

Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!

ఈడీ ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌లను విచారించింది. శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్‌ను ముందుగానే విచారిస్తోంది. సెప్టెంబరు 8న రానా దగ్గుబాటిని, 9న రవితేజ, శ్రీనివాస్‌లను, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను, 15వ తేదీన ముమైత్ ఖాన్‌ను, 17న తనీష్, 20న నందు, 22న తేదీన తరుణ్‌‌ను విచారించనుంది. మరి, ఈసారి మన తారలకు క్లీన్ చీట్ లభిస్తోందో లేదో చూడాలి. 

Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..

Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు

Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన

Published at : 03 Sep 2021 12:49 PM (IST) Tags: rakul preet singh ED tollywood drugs case puri jagannath DRUGS MONEY LAUNDARING PURI టాలీవుడ్ డ్రగ్స్ కేసు పూరీ జగన్నాథ్ Charmi Kaur ఈడీ ముందుకు చార్మీ Navdeep F Club

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?