Puneeth Rajkumar: డాక్టర్ మెడకు చుట్టుకున్న పునీత్ రాజ్‌కుమార్ మరణం... ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే?
పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన వ్యక్తిగత వైద్యుడికి చిక్కులు తెచ్చింది. ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
![Puneeth Rajkumar: డాక్టర్ మెడకు చుట్టుకున్న పునీత్ రాజ్‌కుమార్ మరణం... ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే? Puneeth Rajkumar's personal doctor facing problems with late actors fans Know the full details Puneeth Rajkumar: డాక్టర్ మెడకు చుట్టుకున్న పునీత్ రాజ్‌కుమార్ మరణం... ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/30/f423b1d43d9d552676b2fb7342c37610_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆయన వ్యక్తిగత వైద్యుడు రమణారావు కారణం అని కొంత మంది అభిమానులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆయనకు కొత్త చిక్కులు వచ్చాయి. ఓ అడుగు ముందుకేసిన వీరాభిమానులు బెంగళూరు నగరంలోని సదాశివనగరలో గల పోలీస్ స్టేషన్లో రమణారావు మీద ఫిర్యాదు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రమణారావుకు భద్రత కల్పిస్తూ.... ఆయన నివాసం, ఆస్పత్రి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న మరణించారు. తొలుత ఆయన జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే... జిమ్ చేస్తున్న సమయంలో కాదని, ముందు రోజు నుంచి ఆయన కాస్త అనారోగ్యంతో ఉన్నారని సన్నిహితులు తెలిపారు. పునీత్ తమ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి వెళ్లమని తాను సూచించినట్టు గతంలో రమణారావు చెప్పారు. విక్రమ్ ఆస్పత్రిలో పునీత్ తుదిశ్వాస విడిచారు. రమణారావు సరైన చికిత్స అందించని కారణంగా పునీత్ రాజ్ కుమార్ మరణించాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అభిమానుల నుంచి ఆయనకు ముప్పు ఉందని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!
పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కన్నడ పరిశ్రమ, అభిమానులు విషాదంలో మునిగారు. ప్రస్తుతానికి పునీత్ కుటుంబ సభ్యులు గతంలో వలే ఎవరితోనూ మాట్లాడటం లేదు. విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శివ రాజ్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)