అన్వేషించండి
Advertisement
Samantha: టాక్ ఆఫ్ ది టౌన్.. టాలీవుడ్ లో సమంత సొంత సర్కిల్..
చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు సమంతను సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన 'మీలో ఎవరు కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా సమంతను తీసుకొచ్చారు.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ తరువాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కినేని ఇంటి కోడలు కావడంతో ఆమె ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పెర్సన్ గా ఎదిగింది. ఇక ఆమెకి తిరుగులేదనుకున్న సమయంలో సడెన్ గా నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఇండస్ట్రీ జనాలు సమంతను దూరం పెడతారేమో అని.. సినీ పెద్దలు ఆమెకి అవకాశాలు రాకుండా చేస్తారేమో అనే సందేహాలు తలెత్తాయి. కానీ అలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నట్లు కనిపించడం లేదు.
చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు సమంతను సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన 'మీలో ఎవరు కోటీశ్వరులు' షోకి గెస్ట్ గా సమంతను తీసుకొచ్చారు. ఇక రామ్ చరణ్ అయితే.. తన భార్య ఉపాసనతో కలిసి దీపావళి పార్టీ చేసుకోగా.. దానికి సమంత స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. చైతూతో విడిపోయాక సమంత ఎక్కడికీ వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉంటోంది. తన పని తాను చేసుకుంటూవెళ్తోంది . అంటే టాలీవుడ్ లో ఏ పెద్ద ఫ్యామిలీ కూడా తనను దూరం పెట్టలేదన్నమాట. నాగచైతన్యతో విడిపోయిన తరువాత కూడా ఆమె చైతుకి, అక్కినేని ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు.
అందుకే ఇండస్ట్రీ వ్యక్తులు కూడా సమంతకు వ్యతిరేకంగా మారలేదు. భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాల కారణంగా వారు విడిపోయారని.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకూడదని భావిస్తున్నారు. అందుకే సమంతకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు ఆగిపోయే పరిస్థితి లేదు. ఇక సమంతకు తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి సపోర్ట్ కూడా ఉంది. రీసెంట్ గానే ఆమెతో కలిసి చార్ధామ్ యాత్ర పూర్తి చేసింది సమంత. శిల్పారెడ్డి కుటుంబానికి కూడా సమంత చాలా క్లోజ్. శిల్పారెడ్డి భర్త ప్రీతమ్ రెడ్డి, నాగార్జున మంచి స్నేహితులు. అంటే సమంత-అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్ కొనసాగుతూనే ఉందనిపిస్తుంది.
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్పై చూపించారుగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion