By: ABP Desam | Updated at : 07 Nov 2021 10:14 AM (IST)
అనుష్క
అనుష్కతో యూవీ క్రియేషన్స్ రెండు సినిమాలు నిర్మించింది. ప్రభాస్ హీరోగా నటించిన 'మిర్చి'తో యూవీ సంస్థ ప్రారంభమైంది. అందులో అనుష్క హీరోయిన్. ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో 'భాగమతి' నిర్మించింది. ఇప్పుడు అనుష్క, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. అనుష్క 48వ చిత్రమిది.
Happy Birthday Sweety! 💕
— UV Creations (@UV_Creations) November 7, 2021
We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉.
Directed by #MaheshBabuP
Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh
అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమెతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. అనుష్క కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాను ప్రకటించారు. ఎప్పటి నుంచో ఆ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు. మహేష్ పి. గతంలో సందీప్ కిషన్ హీరోగా 'రా రా కృష్ణయ్య'కు దర్శకత్వం వహించారు. ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే... ఆయన నటించడం లేదు. మరో యువ హీరో నటించనున్నారని తెలిసింది. అతను ఎవరనేది త్వరలో వెల్లడిస్తారు.
దాదాపు అనుష్క రెండేళ్ల తర్వాత మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొత్త సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాది దాటింది. గత ఏడాది అక్టోబర్ 2న 'నిశ్శబ్దం' ఓటీటీలో విడుదలైంది. అయితే... అప్పటికి ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి ఏడాది అయ్యిందని చెప్పుకోవాలి. కరోనా వల్ల థియేటర్లలోకి రావడం కుదరలేదు. చివరకు, ఓటీటీలో విడుదల చేశారు.
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్లో రుద్రాణికి చుక్కలే!
Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Krishna Mukunda Murari November 28th Episode : ముకుంద ప్రేమలో మురారి.. భవాని పెళ్లి ప్రపోజల్ .. కృష్ణ పరిస్థితేంటి!
'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
/body>