Mega154: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. Chiranjeevi, KS Ravindra (Bobby), #Mega154
మెగాస్టార్ చిరంజీవికి సినిమా ఇండస్ట్రీలో, దర్శకుల్లో అభిమానులు ఉన్నారు. వారిలో దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఒకరు. ఇప్పుడు అతనికి చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మెగాస్టార్, బాబీ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 154వ సినిమా ఇది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. చిరంజీవి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
"మెగా154లో మాస్ మూలవిరాట్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక మన అన్నయ్య అరాచకం ఆరంభమే" అని మైత్రీ మూవీ మేకర్స్ చిరంజీవి ఫస్ట్ లుక్ ట్వీట్ చేసింది. లైటర్ తో బీడీ వెలిగిస్తున్న మెగాస్టార్... కళ్లజోడు... మెడలో బంగారు గొలుసులు... ఈ మాస్ లుక్కు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
Our favourite matinee idol, in an avatar we love to see him the most 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2021
Presenting the 'Mass Moolavirat' from #Mega154 😎😎
Inka Mana Annayya Araachakam Aarambham 💥💥
Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP ❤️❤️ pic.twitter.com/qaZaWn49ae
చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం రావడంతో దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేశారు. "మెగాస్టార్! ఆయన పేరు వింటే... అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే... అర్ధం కాని ఆరాటం! తెర మీద ఆయన కనబడితే... ఒళ్లు తెలియని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం... ఆయన్ని మొదటిసారి కలసిన రోజు కన్న కల... (నేడు) నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను" అని బాబీ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
Also Read: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి