అన్వేషించండి
Advertisement
Sai Dharam Tej: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇటీవల యాక్సిడెంట్ కి గురై కొన్నిరోజుల పాటు కోమాలో ఉన్న సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో అభిమానుల్లో ఒకరకమైన టెన్షన్ ఉండేది. తేజుని చూసొచ్చిన వాళ్లు మాత్రం ఆయన బాగానే ఉన్నాడని.. కానీ కాస్త బక్కగా అయ్యారని చెప్పుకొచ్చారు. తాజాగా తేజుకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకొచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు.
దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ''అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ'' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. తేజు కాస్త బరువు తగ్గినట్లుగానే కనిపిస్తున్నా.. పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ ని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
''నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం'' అంటూ సాయి ధరమ్ తేజ్ రాసుకొచ్చారు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion