అన్వేషించండి
Advertisement
Agent Movie: ఇద్దరమ్మాయిలతో అఖిల్ రొమాన్స్.. వర్కవుట్ అవుతుందా..?
అఖిల్ ప్రస్తుతం 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా తీసుకోవాలని భావిస్తున్నారట.
అక్కినేని అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఒక హీరోయినే కనిపించింది. కానీ తొలిసారి ఆయన ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో అఖిల్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి సక్సెస్ ను అందుకుంది. నిర్మాతలకు మోస్తరు లాభాలను తీసుకొచ్చింది. తొలిసారి అఖిల్ హిట్ అందుకున్నారు. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ హీరో 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవలే బుడాపెస్ట్‌లో అఖిల్.. విదేశీ స్టంట్ మెన్‌లతో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లలో నటించాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌తో బుడాపెస్ట్ కి సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా తీసుకోవాలని భావిస్తున్నారట. ఆమె ఎవరంటే.. అతుల్య రవి. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ ఇంతకముందు 'కాదల్ కన్ కట్టుదే', 'ఏమాలి', 'అడుతా సాట్టై', 'నాడోడిగళ్ 2' వంటి సినిమాల్లో నటించింది. సాక్షికి మాత్రం ఇది డెబ్యూ ఫిలిం.
అయితే వీరిద్దరిలో ఎవరు లీడ్ రోల్ పోషిస్తారు..? ఎవరు సెకండ్ హీరోయిన్ గా కనిపించనున్నారనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాను అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు. అలాగే తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
Also Read: హీరో రాజశేఖర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆట
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion