'Lakshya' Movie Song: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..
‘వరుడు కావలెను’తో డీసెంట్ హిట్ అందుకున్న నాగశౌర్య తదుపరి చిత్రం 'లక్ష్య'. ఈ మూవీ నుంచి విడుదలైన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.
"అశ్వత్థామ" లాంటి యాక్షన్ థ్రిల్లర్ తర్వాత నాగశౌర్య "వరుడు కావలెను" అంటూ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా పక్కనపెడితే నాగశౌర్య చేతుల్లో ఇప్పటికే మరొక మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి లక్ష్య. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ సంయుక్త నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పోస్టర్స్ సినీ ప్రియులను మెప్పించాయి. తాజాగా ఈ మూవీ నుంచి సింగిల్ లిరికల్ వీడియో విడుదల చేసింది మూవీ యూనిట్.
Get your soul enraptured with the delightful #OLakshyam song from #Lakshya🏹
— BA Raju's Team (@baraju_SuperHit) November 6, 2021
Here's the Lyrical Video ✨
▶️ https://t.co/eQakLnJBzA@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/zr94B108wJ
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జగపతి బాబుతో నాగశౌర్య రిలేషన్ ను, వారిద్దరి మధ్య ఎమోషన్స్ ను ఎలివేట్ చేసేలా ‘అరచేతుల్లో దాచి వెలగించే దీపం తానే, కనుపాపల్లే కాచి నడిపించే లోకం తానే’ అంటూ సాగే ఈ సాంగ్ ను రహ్మాన్ రచించగా.. హిమ్మత్ మహ్మద్ ఆలపించారు. కీరవాణి తనయుడు కాలభైరవి సంగీతం సమకూర్చాడు. 'అశ్వథ్ధామ'తో యాక్షన్ హీరోగా మెప్పించిన నాగశౌర్య 'లక్ష్య' అంతకుమించి అంటున్నాడు.
ఇక నాగశౌర్య మిగిలిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఇప్పటికే మరో మూడు నాలుగు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. నటుడు - దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పాత్ర మిగతా సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉండబోతుందట. ఏడు భిన్నమైన షేడ్స్ ఉంటాయని టాక్. ఇప్పటి వరకూ అన్ని షేడ్స్ ఉన్న పాత్ర చేయకుపోవడంతో ఈ మూవీ కూడా ప్రత్యేకంగా నిలిస్తుందంటున్నాడు నాగశౌర్య. ఏదేమైనా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్లో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
Also Read: ఈ నంది లేచి రంకెలేస్తే కలియుగాంతమే… ఏటా పెరిగే బసవన్న, కాకులే కనిపించని క్షేత్రం
Also Read: సోదరులకు భోజనం పెట్టి కానుకలిచ్చే వేడుక, కార్తీకమాసంలో రెండో రోజు 'భగినీ హస్త భోజనం'
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి