Rise of Shyam: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
శ్యామ్ సింగ రాయ్... నాని హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో తొలి పాట 'రైజ్ ఆఫ్ శ్యామ్' పాటను నేడు విడుదల చేశారు.#RiseOfShyam #ShyamSinghaRoy
నాని టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో తొలి పాట 'రైజ్ ఆఫ్ శ్యామ్'ను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. ఓ విధంగా ఇది టైటిల్ సాంగ్ అని చెప్పవచ్చు. ఇందులో శ్యామ్ సింగ రాయ్ పాత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
Adrenaline and poetry coming together 🔥🖊
— Nani (@NameisNani) November 6, 2021
Here’s the first song of #ShyamSinghaRoy
A @MickeyJMeyer Musical #RiseOfShyam
Telugu - https://t.co/5jBQJsPQMz
Tamil - https://t.co/36e6LvOdwE
Malayalam - https://t.co/wDIQ8W2jYb
Kannada - https://t.co/9HmW5juwmi#SSRonDEC24th pic.twitter.com/qnIrQgGr1i
"శ్యామ్ సింగ రాయ్... అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే!
శ్యామ్ సింగ రాయ్... అరె తిరగబడిన సంగ్రామం వాడే!
శ్యామ్ సింగ రాయ్... అరె వెనకబడని చైతన్యం వాడే!
శ్యామ్ సింగ రాయ్... సింగ రాయ్... సింగ రాయ్!"
అంటూ సాగిన ఈ గీతాన్ని కృష్ణకాంత్ (కె.కె) రాశారు. మిక్కీ జే. మేయర్ సంగీతం అందించగా... విశాల్ డడ్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి, 'ప్రేమమ్' ఫేమ్ మడోనా సెబాస్టియన్ నటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 'రైజ్ ఆఫ్ శ్యామ్' పాటను కూడా నాలుగు భాషల్లో విడుదల చేశారు. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ నటించిన హిందీ సినిమా '83' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీమిండియా 83 క్రికెట్ వరల్డ్ కప్ విజయం ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: నువ్వే లేకుంటే నేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం, నాగశౌర్య 'లక్ష్య' సింగిల్ లిరికల్ వీడియో..
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి