Virosh Wedding Muhurtham: ఉదయం 8 కాదు... విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ముహూర్తం ఇదే - ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్
Vijay Deverakonda Rashmika Wedding Muhurat: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల పెళ్లి బాజాలు మోగాయి. ముహూర్తం నుంచి అతిథుల వరకు... ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna)ల పెళ్లి బాజాలు మోగాయి. ఈ జంట ఏడు అడుగులు వేసేది గురువారం (ఫిబ్రవరి 26వ తేదీన). వీళ్ళిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారు? ముహూర్తం ఎన్ని గంటలకు? వివాహానికి హాజరు అవుతున్న అతిథులు ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే...
విరోష్ వెడ్డింగ్ ఉదయమే...
ముహూర్తం ఎన్ని గంటలకు?
The Wedding Of Virosh Muhurtham: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలో జరుగుతున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. మరి, ముహూర్తం ఎన్ని గంటలకు? అంటే... గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు. ఆ శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటి కాబోతున్నారు. ఉదయం 8 గంటలకు పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. ఏబీపీ దేశానికి అందిన ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... 10.10 గంటల ముహూర్తం నిశ్చయించారు.
Also Read: Virosh Wedding: విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు... విజయ్ దేవరకొండ, రష్మికకు స్పెషల్ లెటర్
బుధవారం (ఫిబ్రవరి 25వ తేదీన) హల్దీ కార్యక్రమం జరిగిందని తెలిసింది. ఈ పెళ్లి వేడుకకు దేవరకొండ, మందన్నా కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది బంధు మిత్రులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి.
విజయ్ దేవరకొండ మే 9, 1989న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 36 ఏళ్ళు. రష్మిక ఏప్రిల్ 5, 1996న జన్మించారు. ఆమె వయసు 29 ఏళ్ళు. ఇద్దరి మధ్య ఏడేళ్ల గ్యాప్ ఉంది.
తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం...
విజయ్ దేవరకొండ తెలుగు అబ్బాయి. ఆయనది తెలంగాణ. దొరల కుటుంబం నుంచి వచ్చారు. రష్మిక కన్నడ అమ్మాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... కర్ణాటకలోని కొడగు జిల్లా. ఆమె కొడవ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇటు విజయ్, అటు రష్మిక... ఇద్దరి ఇళ్లల్లో పాటించే సంప్రదాయాల ప్రకారం - అంటే తెలుగు, కొడవ పద్ధతుల్లో పెళ్లి చేస్తున్నారని తెలిసింది.
వివాహానికి వెళ్లిన అతిథులు ఎవరెవరు?
Vijay Deverakonda Rashmika Wedding Guest List: విజయ్ దేవరకొండ, రష్మిక వివాహానికి తక్కువ మందిని ఆహ్వానించారు. మార్చి 4న హైదరాబాద్ నగరంలో నిర్వహించబోయే రిసెప్షన్‌కు ప్రముఖులు చాలా మందికి ఆహ్వానాలు వెళ్లాయి. కానీ, పెళ్లికి కొందర్ని పిలిచారు. విజయ్, రష్మికలతో సినిమాలు చేసిన దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, ఇంకా హీరోయిన్లు కళ్యాణీ ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్, ఈషా రెబ్బా, స్టైలిష్ట్ & నిర్మాత శ్రావ్య వర్మ తదితరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు.
పెళ్లిలో అందరికీ ఆ రూల్...
పాటించక తప్పదు, అందుకే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లికి వెళ్లిన అతిథులు అందరికీ ఓ రూల్ పెట్టారు. అది ఏమిటంటే... పెళ్లి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు గానీ, అతిథులు గానీ ఎవరూ మొబైల్ ఫోన్ ఉపయోగించడానికి వీల్లేదు. వివాహాది శుభ కార్యాలు జరిగే వేదిక దగ్గరకు వెళ్లిన వెంటనే ప్రతి ఒక్కరి నుంచి ఫోన్ తీసుకుని, ఆ ఫోనుకు ఓ ట్యాగ్ ఇచ్చి జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు. 'నో మొబైల్' పాలసీని పాటిస్తున్నారు. అందుకే ఫోటోలు లీక్ కావడం లేదు.
Also Read: Shanmukh Jaswanth Engagement: షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు... ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా?























