Karthikeya: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
యువ హీరో కార్తికేయ నవంబర్ 21న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ వేడుకలో తన కాబోయే భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ప్రేమకథ మొత్తం చెప్పేశాడు. Karthikeya Gummakonda
హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో... లోహిత ప్రేమను దక్కించుకోవడం కూడా అంతే కష్టపడ్డానని యువ హీరో కార్తికేయ గుమ్మకొండ చెప్పారు. 'ఆర్ఎక్స్ 100'తో ఆయన హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమాతో అమ్మాయిల్లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతని వెంట చాలామంది పడ్డారు. అతను మాత్రం ఓ అమ్మాయి వెంట పడ్డారు. ఆమె పేరు లోహిత. కార్తికేయకు బీటెక్ క్లాస్‌మేట్. హీరో అవ్వకముందే కార్తికేయ, లోహిత ప్రేమకథ మొదలైంది. లోహిత ప్రేమ పొందడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యానని కార్తికేయ అన్నారు.
కార్తికేయ హీరోగా నటించిన 'రాజా విక్రమార్క' ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈవెంట్ ఆఖరున తనకు కాబోయే భార్య లోహితను పరిచయం చేయడంతో పాటు తన ప్రేమకథను కార్తికేయ వివరించారు.
"బీటెక్ జాయిన్ అయిన తర్వాత రెండు మూడేళ్లు కెరీర్ గోల్స్ ఏమీ ఉండవు. లవ్ స్టోరీలు అప్పుడే మొదలవుతాయి. నా లవ్ స్టోరీ కూడా అప్పుడే మొదలైంది. నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. తనకు గిఫ్టులు ఇచ్చాను. అలా అలా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి లవ్ ఓకే చేయించుకున్నాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పడినంత స్ట్రగుల్ ప్రేమ కోసం పడ్డాను. పెద్ద గొప్పగా ఏమీ ప్రపోజ్ చేయలేదు. ఫోనులో చెప్పాను. అప్పుడే 'నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి మీ నాన్నను అడుగుతా' అని తనకు ప్రామిస్ చేశా. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. నవంబర్ 21న మా పెళ్లి" అని 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ చెప్పారు.
సినిమా స్టయిల్ లో మోకాళ్ల మీద వంగి లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు. కార్తికేయ ప్రేమకథను చెప్పి, అలా ప్రపోజ్ చేసేసరికి లోహిత కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. కార్తికేయను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. నవంబర్ 12న సినిమా రిలీజ్... నవంబర్ 21న పెళ్లి... కార్తికేయ ఈ నెలంతా చాలా బిజీ బిజీ.
Also Read: మంగళం శీను మామూలుగా లేడుగా... విలన్‌గా సునీల్ లుక్ చూశారా?
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
Also Read: 'జై భీమ్' సినిమాలో 'సినతల్లి'గా నటించిన ఆమె గురించి మీకు ఈ విషయాలు తెలుసా..!
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి