By: ABP Desam | Updated at : 07 Nov 2021 10:40 AM (IST)
'పుష్ప: ద రైజ్'లో మంగళం శ్రీనుగా సునీల్
మంగళం శ్రీను... 'పుష్ప' సినిమాలో సునీల్ పాత్ర పేరు. ఆ పేరు విన్నప్పుడు 'కొంచెం కొత్తగా ఉంది కదూ' అనుకున్నారంతా! పేరు మాత్రమే కాదు... లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. రెగ్యులర్‌గా సినిమాల్లో సునీల్‌కు, మంగళం శ్రీనుకు వ్యత్యాసం చూపించారు. ఈ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కు ఇవ్వాలి. వేళ్లకు ఉంగరాలు... చేతికి వాచ్... మెడలో బంగారు గొలుసులు... కోరమీసకట్టు... కొంచెం వెనక్కి వెళ్లిన జుట్టు... అన్నిటి కంటే ముఖ్యంగా కళ్లల్లో ఎక్స్‌ప్రెషన్... మంగళం శ్రీను మామూలుగా లేడు. సినిమాలో సునీల్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Presenting the face of evil 😈
— Mythri Movie Makers (@MythriOfficial) November 7, 2021
Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/9XtnGSOjwF
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప: ద రైజ్'. ఇందులో సునీల్ విలన్. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా విలన్ రోల్ చేస్తున్నారు. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్టు గతంలో ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది.
గతంలోనూ సునీల్ విలన్ రోల్ చేశారు. రవితేజ 'డిస్కో రాజా'లో హీరో స్నేహితుడిగా ఉంటూ, మంచిగా నటిస్తూ... పతాక సన్నివేశాలు వచ్చేసరికి క్రూరత్వం బయటపెట్టే పాత్ర చేశారు. 'కలర్ ఫొటో'లో చెల్లెలు ప్రేమకు అడ్డుగా నిలిచే అన్న పాత్రలో విలనిజం చూపించారు. ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సునీల్ విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
Also Read: 'జై భీమ్' సినిమాలో 'సినతల్లి'గా నటించిన ఆమె గురించి మీకు ఈ విషయాలు తెలుసా..!
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
Also Read: తామర... సితార సంస్థ నిర్మిస్తున్న తొలి ఇండో-ఫ్రెంచ్ సినిమా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
HanuMan Movie: ‘ఆవకాయ.. ఆంజనేయ..’ సాంగ్ అద్భుతహా - యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘హనుమాన్’ పాట
War 2 Release Date: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ విడుదల ఎప్పుడంటే?
Yeto Vellipoyindi Manasu Serial: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌కు పోటీగా స్టార్ మా కొత్త సీరియల్? ముదురు బెండకాయ కథ అంటూ?
Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర కోసం శోభా ఏడుపు - పడవల టాస్క్‌లో గౌతమ్ ‘బోల్తా’
Biggest Flop Movie: రూ.20 కోట్ల బడ్జెట్ మూవీకి కలెక్షన్స్ రూ.40 లక్షలే - ఈ బిగ్టెస్ట్ ఫ్లాప్ మూవీ గురించి తెలుసా?
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
/body>