Sooryavanshi: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్ పై చూపించారు కొంతమంది రైతులు. అతని సినిమాను అడ్డుకున్నారు.
కేంద్రవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చాలా రోజుల్నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ నిరసనల సెగ ఇప్పుడు అక్షయ్ కుమార్ కు తాకింది. అతని కొత్త సినిమా ‘సూర్యవంశీ’ని కొన్ని థియేటర్లలో అడ్డుకున్నారు రైతులు. పంజాబ్ లోని హోషియర్ పూర్ లోని అయిదు సినిమా హాళ్లలో సూర్యవంశీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు థియేటర్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. థియేటర్ల వెలుపల పెట్టి సినిమా పోస్టర్లను చించేశారు. సినిమాకు వస్తున్న వారిని వెనక్కి పంపేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసనకు అక్షయ్ కుమార్ మద్దతు ఇవ్వలేదని రైతులు చెప్పారు. అందుకే అతడిని, అతని సినిమాలను వ్యతిరేకిస్తతున్నట్టు తెలిపారు.
చిత్రప్రదర్శనను వ్యతిరేకిస్తూ భారతీ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్వరణ్ దుగ్గా ఆధ్వర్యంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్షయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సినిమా థియేటర్ల యాజమాన్యంతో స్క్రీనింగ్ ఆపివేయాలని గొడవకు దిగారు. తాము చేస్తున్న పోరాటంపై అక్షయ్ కనీసం స్పందించలేదని, అలాంటి వ్యక్తి సినిమాలను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలు రద్ధు చేసేవరకు అక్షయ్ సినిమాలను తమ ప్రాంతంలో ఆడనివ్వమని చెప్పారు. కేంద్రం చేసిన చట్టాలు తనపై ఇలా ప్రభావం చూపిస్తాయని అక్షయ్ కూడా ఊహించిఉండరు.
ఏమిటా చట్టాలు...
కేంద్రం గతేడాది మూడు రకాల వ్యవసాయల చట్టాలను రూపొందించింది. అవి నిత్యవసర సరుకుల బిల్లు, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార బిల్లు, రైతుల ధర హామీ - సేవల ఒప్పంద బిల్లు -2020.... ఈ మూడు బిల్లులను రైతులను వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానాలలో రైతులు భారీగా ఆందోళన చేపట్టారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో దశల వారీగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
Also read: డెంగ్యూకే కాదు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టే పండు... కివీ
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి