X

Baahubali Buffalo: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?

సదర్ ఉత్సవాల్లో ఈసారి బాహుబలి దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

FOLLOW US: 

దీపావళి మరుసటి రోజు హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆరోజున ఎన్నోయాదవ కుటుంబాలు తమ దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి, తీన్మార్ డ్యాన్సులతో ఇరగదీస్తారు. ఈసారి సదర్ ఉత్సవాల్లో ఓ బాహుబలి దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొర్రజాతికి చెందిన దున్నపోతును హర్యానా నుంచి చప్పల్ బజార్ కు చెందిన లడ్డూ యాదవ్ అనే వ్యక్తి తీసుకొచ్చారు. దీని యజమాని బల్వీర్ సింగ్. హర్యానాలో నివసిస్తారు. ఈ దున్నపోతును అద్దెకిస్తూ ఉంటారు. అలాగే అంతర్జాతీయ పోటీలకు తీసుకెళ్తుంటారు. ఇప్పటికే ఇది నాలుగుసార్లు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ ను సాధించింది. దీని ఖరీదు రూ.30 కోట్లు. ఈ దున్నపోతును ఒక్కరోజుకు అద్దెకు తీసుకుంటే కోటీ ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలి. సదర్ ఉత్పవాల్లో ఈ దున్నపోతును అలంకరిచేందుకు లడ్డూ యాదవ్ ఏకంగా మూడు కిలోల బంగారు గొలుసును చేయించారు. అందుకు ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ఆ బంగారు గొలుసును తాను తిరిగి తీసుకోనని దున్నకే వదిలేస్తానని చెబుతున్నాడాయన.

ఖర్చును తట్టుకోవడం కష్టమే...
ఈ దున్నపోతు మామూలుది కాదు. దీన్ని తిండికి చాలా ఖర్చవుతుంది. రెండు పూటలా రెండు డజన్ల యాపిళ్లు, కిలో డ్రైఫ్రూట్స్ తినేస్తుంది. పొద్దున్నే కాసేపు వాకింగ్ చేస్తుంది. రాత్రయితే ఓ ఫుల్ బాటిల్ మందు తాగుతుంది. ఆవనూనెతో మర్ధనా రోజూ ఉండాలి. ఈ దున్నపోతును చూసేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. దీని అసలు పేరు ‘లవ్ రానా’. దీని బరువు రెండు వేల కిలోల వరకు ఉంటుంది. 

అప్పట్నించి మొదలు... 
సదర్ ఉత్సవాలు హైదరాబాద్లో 1946 నుంచి అంగరంగ వైభవంగా జరపడం మొదలైంది. పండుగ కోసం దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. కరోనా వల్ల గత రెండేళ్లుగా సదర్ ను జరుపుకోలేదు. అందుకే ఈసారి ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో ‘లవ్ రానా’ను హర్యానా నుంచి తెప్పించారు. 

Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Baahubali Buffalo Sadar Festival Haryana Buffalo హర్యానా దున్నపోతు

సంబంధిత కథనాలు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది...  ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!