అన్వేషించండి

High BP: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే

ఆధునిక కాలంలో హైబీపీ, షుగర్ వంటివ రోగాలు సాధారణమైపోయాయి. ప్రతి వందమందిలో సగం మందిలో ఈ రోగాలు కనిపిస్తున్నాయి.

పనిఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో కలహాలు, నిద్రలేమి, మానసిక ఆందోళన, చెడు ఆహారపు అలవాట్లు... కారణాలు ఎన్నో, కానీ ఫలితం మాత్రం హైబీపీ. ఇంతకుముందు కేవలం వయసు ముదిరాకే హైబీపీ వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే దీని జాడలు కనిపిస్తున్నాయి. దీనివల్ల షుగర్ ఇతర ఆరోగ్యసమస్యలు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే హైబీపీ రాకుండా ముందే అడ్డుకుంటే...సంతోషకర జీవితాన్ని పొందిన వారవుతారు. ఇందుకోసం యుక్త వయసు నుంచే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 

ఏంచేయాలి?
1. వయసులో ఉన్నవారు ఉప్పుని చాలా తేలికగా తీసుకుంటారు. ఎంత తిన్నా ఫర్వాలేదనుకుంటారు. మీరు యుక్తవయసులో తీసుకున్న ఉప్పు శాతమే... మీకు హైబీపీ ఎంత త్వరగా వస్తుందో నిర్ణయిస్తుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం బాగా తగ్గించాలి. వంటకాలు కాస్త చప్పగా అనిపించినా ఫర్వాలేదని సర్దుకుపోతే భవిష్యత్తులో మీకే మంచిది.  ఉప్పు తగ్గినప్పుడు కాస్త మసాలాలు దట్టించుకోండి రుచి కోసం. అలా మరీ ఎక్కువ కాదు వేసుకోవద్దు.
2. బాడీ మాస్ ఇండెక్స్... ఈ ఎత్తుకు తగ్గ బరువు ఉండడం చాలా ముఖ్యమని చెబుతోంది. మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో ఆరోగ్యనిపుణుల సాయంతో తెలుసుకుని అదే బరువును మెయింటేన్ చేయండి. అధిక బరువు, ఊబకాయం వంటివి హైబీపీ, షుగర్ వ్యాధుల బారిన త్వరగా పడేలా చేస్తాయి. 
3. కొలెస్ట్రాల్ కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుంటే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. కేవలం హైబీపీ రావడమే కాదు, గుండె జబ్బులకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం అవసరమైనంత మాత్రమే ఉన్నట్టు చూసుకోండి.  ఇందుకు వైద్యుల సలహా తీసుకోవచ్చు. 
4. మీకు ధూమపానం, మద్యపానం అలవాటుందా వెంటనే మానివేయండి. మానివేయడం కష్టం అనుకుంటే కనీసం తగ్గించండి. వీటివల్ల ముప్పు చాలా ఎక్కువ. 
5. ఇంట్లో, ఆఫీసులో గంటలుగంటలు కూర్చోవడం మానేసి నడవడం అలవాటు చేసుకోండి. శారీరకంగా చాలా యాక్టివ్ గా ఉండాలి. రోజులో కనీసం అరగంటైనా వ్యాయమం చేయండి. వీలుకాకపోతే వేగంగా నడవడం వంటివి చేయండి. 
6. అతిగా శుధ్ధి చేసిన ఆహారపదార్థాల వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర తాజాగా వండుకుని తినే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. పంచదారను తినడం తగ్గించండి. అంతేకాదు తరచూ వేపుళ్లు తినడం, బిర్యానీలే తినడం కూడా తగ్గించండి. పదిరోజులకోసారి అలాంటివి తింటే పెద్దగా ప్రమాదం ఉండదు. 
7. అల్లాన్ని ఎక్కువగా వాడడం అలవాటు చేసుకోవాలి. అల్లంటీ, అల్లం చారు వంటివి వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Embed widget